https://oktelugu.com/

వైరల్: ఒకే ఫ్రేములో టాలీవుడ్ అగ్రహీరోలు

స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహాలు వెల్లివిరిసాయి. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ ఆదివారం ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకొని సినిమా తారలు కూడా తమ స్నేహితులతో దిగిన ఫొటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. టాలీవుడ్ యువ హీరో నాని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. అగ్రహీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, బాహుబలి స్టార్స్ ప్రభాస్, రానాలతో కలిసి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 2, 2021 / 09:50 AM IST
    Follow us on

    స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్నేహాలు వెల్లివిరిసాయి. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ ఆదివారం ఫ్రెండ్ షిప్ డేను పురస్కరించుకొని సినిమా తారలు కూడా తమ స్నేహితులతో దిగిన ఫొటోలు షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు.

    టాలీవుడ్ యువ హీరో నాని తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. అగ్రహీరోలు రాంచరణ్, ఎన్టీఆర్, బాహుబలి స్టార్స్ ప్రభాస్, రానాలతో కలిసి దిగిన పాత ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో హీరో నాని పంచుకున్నారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయా అభిమానులు, సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు.

    సినీ ఇండస్ట్రీలో తన ఆప్తులు అంటూ ఎన్టీఆర్, రాంచరణ్, ప్రభాస్, రానాలను నానా పేర్కొనడం విశేషం. ఒకే ఫ్రేములో స్టార్ హీరోలందరూ ఇందులో కనిపించి అలరించారు. దీంతో ఈ ఫొటో డ్రెండ్ అవుతోంది. ఈ ఫొటోను రాజమౌళి కుమారుడు కార్తికేయ వెడ్డింగ్ సందర్భంగా రాజస్థాన్ లో తీసింది.

    ఇక నాని అగ్రహీరోలతోనే కాదు.. తన చిన్నప్పటి స్నేహితులు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ , అల్లరి నరేశ్ తో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు.

    ప్రస్తుతం నాని హీరోగా ‘టక్ జగదీష్’ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కూడా పూర్తికావచ్చింది.