Chiranjeevi Bobby New Movie Story: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా విషయంలో చిరంజీవి చాలా ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మూవీ సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరోసారి వీళ్ళ కాంబినేషన్ కైతే విపరీతమైన క్రేజ్ దక్కుతుంది. ఇక దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా చిరంజీవి ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అందుకే ఆయన ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని బాబీ తో అడిగి తెలుసుకొని మరి సినిమాని అనుకున్నది అనుకున్నట్టు తీసే విధంగా ప్రణాళికలు రూపొందించుకోమని బాబీ కి చెబుతున్నారట. ఇక బాబీ సైతం ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలన్నింటిని సూపర్ సక్సెస్ గా నిలుపుతుండటం తో అతనికి కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపైతే ఉంది. గత సంవత్సరం బాలయ్య బాబుతో చేసిన డాకు మహారాజ్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు…
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా బాలయ్య బాబు చేసిన ‘భగవంత్ కేసరి’ సినిమా మాదిరిగానే ఉంటుందని చిరంజీవి తన కూతురి కోసం ఈ సినిమాలో ఏం చేశాడు. తన కూతురును ఎలా కాపాడుకున్నాడు అనే అంశాలను ఈ సినిమాలో ప్రధానాంశాలుగా చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే చిరంజీవికి ఉన్న బ్యాక్ స్టోరీని సైతం సినిమాలో చాలా హైలైట్ గా రాసుకున్నారట…
మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాలో 50 సంవత్సరాల పైబడిన ఏజ్ గల వ్యక్తిగా కనిపించబోతున్నాడనేది వాస్తవం… ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ కి చాలా మంచి గుర్తింపు ఉంది. కాబట్టి మరోసారి సక్సెస్ తో అభిమానులను అలాగే ప్రేక్షకులను అలరిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
