Homeఎంటర్టైన్మెంట్Ramesh Babu Son Jayakrishna: రమేష్ బాబు కొడుకు జయకృష్ణ కోసం మహేష్ బాబు చేస్తున్న...

Ramesh Babu Son Jayakrishna: రమేష్ బాబు కొడుకు జయకృష్ణ కోసం మహేష్ బాబు చేస్తున్న పని ఇదీ…

Ramesh Babu Son Jayakrishna: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి మూడో జనరేషన్ హీరో కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగా పరిచయమవ్వడమే కాకుండా భారీ […]

Ramesh Babu Son Jayakrishna: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి మూడో జనరేషన్ హీరో కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. మహేష్ బాబు వాళ్ళ అన్న రమేష్ బాబు కొడుకు అయిన జయకృష్ణ ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగా పరిచయమవ్వడమే కాకుండా భారీ సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం తను హీరోగా మారడమే కాకుండా టాప్ హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశమైతే ఉంటుంది.

అయితే ఈ సినిమా యూనిట్ ను ఎంకరేజ్ చేయడానికి మహేష్ బాబు సైతం ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది. జయకృష్ణకి మొదటి సినిమా కావడం వల్ల తనకు ఒక బూస్టప్ ఇచ్చినట్టుగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఒక స్పెషల్ క్యారెక్టర్ లో ఒక రెండు నిమిషాల పాటు సినిమాలో కనిపించబోతున్నాడట.

ప్రస్తుతం ఆయన వారణాసి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికి ఈ సినిమాకి సంబంధించిన షూట్ లో ఒకరోజు పాల్గొనడానికి మహేష్ డేట్స్ కూడా ఇచ్చారట. ఇక ఎప్పుడు ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

కాబట్టి వారణాసి సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు వారణాసి సినిమాతో మొత్తాన్ని మార్చుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తే మాత్రం మహేష్ బాబుకి హాలీవుడ్ లో సైతం భారీ క్రేజ్ దక్కుతుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper