Chiranjeevi Bobby Movie Item Song Removed: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ఒక కొత్త సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ కమర్షియల్ హంగులతో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఓపెనింగ్ అయితే చేశారు…అది ఈ సినిమాలో చిరంజీవి 50 సంవత్సరాలకు పైబడిన వయసు గల వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో చిరంజీవి ఒక పెయిన్ ఫుల్ క్యారెక్టర్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తోడుగా ఈ సినిమాలో కొన్ని సాంగ్స్ కూడా ఉండబోతున్నాయి. అయితే సినిమాలో ఐటెం సాంగ్ ఉండకూడదని చిరంజీవి బాబీ నిర్ణయించుకున్నారట. మొదట ఐటెం సాంగ్ పెడదామని అనుకున్నప్పటికి సినిమా వెళుతున్న ఫ్లో కి ఐటెం సాంగ్ అడ్డంకి గా మారుతుందని అనుకున్నారట. అది చాలావరకు జనాల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని వల్లే ఆ సాంగ్ ని తీసేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందే ఐటెం సాంగ్ ఉంటుందనుకొని ఆ తర్వాత దాన్ని తీసేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. సినిమా అనేది ప్రేక్షకుడికి చాలా దగ్గరగా ఉండాలి.
అలాంటప్పుడు దానిని వాళ్ళు ఓన్ చేసుకొని సినిమాని రిపీటెడ్ గా చూసే అవకాశాలైతే ఉంటాయి. అలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం బీ,సీ సెంటర్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం కావాలనే ఐటెం సాంగ్ పెట్టడం కరెక్ట్ కాదు. నిజానికి సినిమా చూసే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టినట్టుగా అవుతుంది.
కాబట్టి ఈ విషయాల్లో కొంతమంది సినిమా మేకర్స్ ఇప్పుడిప్పుడు కొంతవరకు జాగ్రత్తలైతే తీసుకుంటున్నారు. ఇక ఆ క్రమంలోనే చిరంజీవి బాబీ ఇద్దరు కూడా ఈ సినిమా నుంచి ఐటెం సాంగ్ తొలగించేసి ఒక మంచి పని చేశారనే చెప్పాలి. ఇక ఈ సినిమా ప్రస్తుతం రెగ్యూలర్ షూటింగ్ అయితే జరుపుకుంటుంది.
ఈ సినిమాని 2027 సంక్రాంతి కానుకకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి బాబీ సన్నాహాలు చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందే ‘వాల్తేరు వీరయ్య ‘ అనే సినిమా 2023 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన విషయం మనందరికి తెలిసిందే…
