Chiranjeevi Bobby: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది ఇప్పుడు కీలకంగా మారబోతోంది…ఈరోజు చిరంజీవి తన 70వ పుట్టినరోజుని జరుపుకుంటున్న సందర్భంగా తన అభిమానులు భారీ ఎత్తున ఆనందపడేలా చేస్తున్నాడు. నిన్న విశ్వంభర సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని రిలీజ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ఈరోజు అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశాడు. ఇక దాంతోపాటుగా ఇప్పుడు బాబీతో చేస్తున్న సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి బ్లేడీ బెంచ్ మార్క్ అంటూ ఒక గొడ్డలితో ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి బాబీతో ఇంతకుముందు చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆయనకు మరోసారి అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఈ సినిమాతో బాబీ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.
Also Read: కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు..వీడియో వైరల్!
తద్వారా చిరంజీవి కెరియర్ లోనే బాబీ ఒక గుర్తుండిపోయే సినిమాని ఇస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న బాబీ అదే సక్సెస్ ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఈ సినిమాతో చిరంజీవి ఒక భారీ గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రాబోయే ఈ మూడు సినిమాలతో పాన్ ఇండియా లో భారీ సక్సెస్ ని సాధించి ఈతరం హీరోలకు తను ఏమాత్రం తీసిపోనని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఇలాంటి సక్సెస్ ని సాధిస్తాయి అనేదాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తినైతే కలిగిస్తోంది… చూడాలి మరి ఇక మీదట రాబోయే అన్ని సినిమాలు అతని ఇమేజ్ ను పెంచుతాయా? లేదంటే మరోసారి డౌన్ ఫాల్ అయ్యే విధంగా చేస్తాయా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…