Chiranjeevi Birthday Celebration: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన 70 వ ఏటా లోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు ఒక పండుగ లాగా ఎంత ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. మరో పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. ప్రతీ ఏడాది హైదరాబాద్ లోని తన నివాసం లోనే పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుపుకునే మెగాస్టార్ చిరంజీవి, ఈ ఏడాది మాత్రం గోవా లో తన కుటుంబం తో కలిసి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. నిన్న గోవా ముఖ్యమంత్రి కూడా మెగాస్టార్ చిరంజీవి ని ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన సంగతి తెలిసిందే. గోవా లో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలను చిరంజీవి కేవలం తన కుటుంబానికే పరిమితం చేశాడు. పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), అల్లు అర్జున్(Icon Star Allu Arjun) వంటి వారు ఈ వేడుకకు రాలేదు కానీ, రామ్ చరణ్(Global Star Ram Charan) మాత్రం హాజరు అయ్యాడు.
Also Read: ‘మన శంకర వరప్రసాద్’ గ్లింప్స్ లో ఉన్నది చిరంజీవి కాదా..? ఆసక్తి రేపుతున్న అనిల్ రావిపూడి కామెంట్స్!
కాసేపటి క్రితమే రామ్ చరణ్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఒక వీడియో ని షేర్ చేస్తూ ఎమోషనల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈరోజు కేవలం నీ పుట్టిన రోజు మాత్రమే కాదు నాన్న, ఒక అసాధారణమైన మనిషి కి సంబంధించిన సంబరాలు ఇవి. నేను అందుకునే ప్రతీ విజయం, నేను నేర్చుకున్న ప్రతీ విలువ నీ నుండి వచ్చినదే. మీ వయస్సు మాత్రమే 70 ఏళ్ళు, కానీ మీ మనస్సు మాత్రం ఇంకా చిన్న వయస్సు లోనే పెరగడం ఆగిపోయింది. నువ్వు జీవితాంతం ఆరోగ్యవంతంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అత్యుత్తమ నాన్న గా వ్యవహరిస్తున్నందుకు ధన్యవాదాలు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో లో చిరంజీవి, రామ్ చరణ్ మరియు సురేఖ తో పాటుగా మనవరాళ్లు కూడా ఉన్నారు. ఈ వీడియో ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు.
కుటుంబం అంటే మెగా కుటుంబమే, ఇలా ప్రతీ కుటుంబం కలిసి ఉంటే అసలు సమాజం లో ఎలాంటి సమస్యలు ఉండవు అంటూ సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇకపోతే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుతం అనిల్ రావిపూడి తో ఆయన చేస్తున్న చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు. ఈ వీడియో లో చిరంజీవి ని స్టైలిష్ లుక్ లో చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా రౌడీ అల్లుడు చిత్రం నాటి మెగాస్టార్ చిరంజీవి ని గుర్తు చేసుకున్నారు. ‘మన వరప్రసాద్ గారు ఈ పండక్కి వస్తున్నారు’ తో చిరంజీవి ఎన్ని సంచలన రికార్డ్స్ ని నెలకొల్పబోతున్నాడో చూడాలి.
View this post on Instagram