Kukatpally Sahasra Case: కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల బాలిక హత్య కేసు సంచలనం సృష్టించింది. హైదరాబాద్ లోని ఖరీదయిన ప్రాంతంలో ఒకటైన కూకట్ పల్లి లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ ఈ కేసు లో మాత్రం పురోగతి లభించలేదు. ఎన్ని వేల సీసీ కెమెరాలు జల్లెడ పట్టినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఒకానొక దశలో ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్థం కాలేదు. ఎటు వైపు చూసినా పోలీసులకు చిన్న క్లూ కూడా దొరకలేదు.
Also Read: కుటుంబ సభ్యులతో మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టినరోజు వేడుకలు..వీడియో వైరల్!
ఇలా రకరకాలుగా ప్రయత్నిస్తున్న పోలీసులకు ఒక చిన్న ఆధారం ఈ కేసును పరిష్కరించే దిశగా అడుగులు వేయించింది.. ఇదే ప్రాంతంలో పక్క బిల్డింగ్ లో బాలుడి కుటుంబం ఉంటున్నది. ఆ బాలుడు ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. అతడు సామాజిక మాధ్యమాలు విపరీతంగా చూస్తుంటాడు. అవి చూసి దొంగతనం ఎలా చేయాలో స్క్రిప్ట్ రాసుకున్నాడు. హౌ టు ఓపెన్ డోర్.. హౌ టు బ్రేక్ హుండీ.. హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ అతను రాసుకున్నాడు. పక్క గుడిలో చోరీ చేశాడు. అక్కడ హుండీ పగలగొట్టాడు. అనంతరం సహస్ర ఇంట్లోకి ప్రవేశించాడు . ఆ సమయంలో వారింట్లో ఎవరూ లేరు. ఇదే అదునుగా సహస్ర ఇంట్లో ఉన్న 80,000 దొంగిలించాడు. అతడు చేసిన దొంగతనాన్ని సహస్ర చూసింది. ఆమె ఎవరికైనా చెబుతుందేమోననే భయంతో సహస్రను 12 చోట్ల కత్తితో పొడిచాడు.
మధ్యాహ్నం భోజన సమయంలో సహస్ర తండ్రి ఇంటికి వచ్చాడు. తలుపు తెరిచి చూడగా సహస్ర రక్తపు మడుగులో కనిపించింది. అతడు గట్టిగా కేకలు వేశాడు.. దీంతో స్థానికంగా ఉండే వారు కూడా అక్కడికి వచ్చారు. వారు పోలీసులకు ఈ విషయాన్ని తెలియజేశారు. సహస్ర కేసును విచారిస్తున్న సమయంలో ఆమె తండ్రి మీద పోలీసులకు అనుమానం కలిగింది. మీడియా కూడా అదే కోణంలో వార్తలు ప్రసారం చేసింది. చివరికి పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు..
సహస్రను గొంతు కోసి చంపిన తర్వాత.. ఆమె శరీరంపై 18 పోట్లను పొడిచాడు. పక్క బిల్డింగ్ లో నుంచి సహస్ర కుటుంబం నివాసం ఉంటున్న ఇంట్లోకి నిందితుడు వచ్చాడు. అయితే అతడు వచ్చిన విషయాన్ని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి గమనించాడు. అతడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ బాలుడు చదువుకుంటున్న స్కూలుకు పోలీసులు వెళ్లారు. అక్కడ విచారించారు. అతడు నోరు విప్పకపోవడంతో బాలుడి ఇంట్లో తనిఖీలు చేశారు. అతని ఇంట్లో కత్తి కనిపించింది.. రక్తపు మరకలు ఉన్న దుస్తులు కూడా లభ్యమయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. బాలుడిని అరెస్టు చేసి.. విషయాన్ని బయటపెట్టారు.