Chiranjeevi And Bobby Story: గత 50 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్క నటుడు మెగాస్టార్ చిరంజీవి…ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ప్రస్తుతం 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే ఆయనకు సినిమాలాంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ తను స్వయంగా డూప్ లేకుండా కొన్ని ఫైట్ సీన్స్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. మరి చిరంజీవి లాంటి నటుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఎవరు ఉండరు అనేది వాస్తవం…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన బాబీ తో ఒక సినిమా చేయబోతున్నాను అంటూ గత కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో బ్లడీ బెంచ్ మార్క్ అంటూ ఒక ట్యాగ్ ని వదలడమే కాకుండా గొడ్డలి పోటు వేస్తే దాని వెంట రక్తం కారినట్టుగా ఒక పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇక ఈ పోస్టర్ ను బట్టి చూస్తే ఈ సినిమాను మాస్ మసాలా ఎలిమెంట్స్ తో నింపేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాని ఒక రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబోతున్నారట. ఇక మొత్తానికైతే ఈ సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియా లో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ కథ ఏంటంటే చిరంజీవికి పెళ్లి అయి ఒక పిల్లాడు కూడా ఉంటాడు. కొడుకుతోపాటు అతని భార్యను చంపేసిన కొంతమంది రౌడీలు చంపేస్తారట…
Also Read: బాబీ తో మూవీని అనౌన్స్ చేసిన చిరంజీవి…బ్లేడి బెంచ్ మార్క్…
వాళ్ళను వెతికి పట్టుకొని చంపడమే ఈ సినిమా స్టోరీ గా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి ఇప్పటివరకు ఇలాంటి సినిమాల్లో నటించినప్పటికి ఈ సినిమా మాత్రం చాలా సెపరేట్ గా ఉంటుందని ప్రేక్షకులందరికి ఒక ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని అలాగే అభిమానులకు అయితే విజువల్ ఫీస్టుగా ఉంటుందని బాబీ తెలియజేస్తున్నాడు…
ఇక ఇదంతా చూసిన కొంతమంది మాత్రం కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి కథల కంటే గొప్ప కథలు ఏమి వస్తాయి. ఒక వేళ వచ్చిన ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు అంటూ మరికొంతమంది మాట్లాడుతుండటం విశేషం…
ఇక ఇంకొంతమంది ఎప్పుడు చిరంజీవి ఇలాంటి కథలను ఎంచుకుంటాడు మరోసారి ఏ స్టోరీలను రిపీట్ చేస్తున్నాడా అంటూ కొంత వరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది…