Chiranjeevi AnilRavipudi: ‘భోళా శంకర్’ వంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘విశ్వంభర'(Vishwambhara Movie) చిత్రం రీసెంట్ గానే పూర్తి అయ్యింది. కానీ విడుదల తేదీ ఎప్పుడు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో చేస్తున్న చిత్రం విడుదల తేదీ మాత్రం ఖరారు అయ్యింది. 2026 సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా షూటింగ్ అప్పుడే రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి డ్రిల్ల్ మాస్టర్ గా, CID ఆఫీసర్ గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యారక్టర్ పేరు శివ శంకర్ వర ప్రసాద్ అట. చిరంజీవి అసలు పేరు ఇదే అనే విషయం మన అందరికీ తెలిసిందే.
సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన పేరు చిరంజీవి గా మారింది. అభిమానులకు బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఈ పేరు ని తన హీరో క్యారక్టర్ కి పెట్టుకున్నాడు అనిల్ రావిపూడి. అయితే సినిమాకు టైటిల్ కూడా అదే పెట్టాలని ఫిక్స్ అయ్యాడట అనిల్. ‘మన శివ శంకర వరప్రసాద్ గారు'(Siva Sankara Varaprasad Garu) అనే టైటిల్ ని పెట్టేందుకు పరిశీలిస్తున్నాడట. చిరంజీవి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వచ్చే నెల 22వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారట. అప్పటి వరకు ఏది ఖరారు కాదు. కానీ ఈ టైటిల్ ని త్వరలోనే రిజిస్టర్ చేయించే ఆలోచనలో మాత్రం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. అభిమానులకు ఈ టైటిల్ కన్సెట్ అవ్వొచ్చు ఏమో కానీ, మామూలు ఆడియన్స్ ఎంత వరకు కనెక్ట్ అవుతారు అనేది చూడాలి.
Also Read: Kota Srinivasa Rao Final Role: కోట శ్రీనివాసరావు చివరగా నటించింది హరిహర వీరమల్లు లోనేనా..?
ఎందుకంటే టైటిల్ పొడవుగా ఉంది. ఉచ్చారణ కూడా చాలా కష్టం. కాబట్టి మేకర్స్ మరో టైటిల్ ని కూడా పరిగణలోకి తీసుకుంటే మంచిది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి మూవీ టైటిల్స్ చాలా ఆకర్షనీయంగా, సాధారణంగా, అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. కానీ ఈ టైటిల్ మాత్రం ఆ విధంగా లేదు. కాబట్టి మేకర్స్ ఒకసారి పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది అని అభిమానుల ఉద్దేశ్యం. చూడాలి మరి ఎంత వరకు అభిమానుల రిక్వెస్ట్ ని పరిగణలోకి తీసుకుంటారు అనేది. ఇకపోతే ఈ సినిమాలో నయనతార తో పాటు క్యాథరిన్ థెరిసా కూడా కీలక పాత్ర పోషిస్తుందట. మెగాస్టార్ చిరంజీవి తో ఆమె గతం లో ‘వాల్తేరు వీరయ్య’ లో నటించింది.