Balakrishna Family Entertainer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu) ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఆయన ప్రతి సినిమా మీద భారీగా ఎఫర్ట్ పెట్టి సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. తన అభిమానులు అతని నుంచి వచ్చే సినిమాల్లో మాస్ ఎలివేషన్స్ ఉంటే ఎక్కువగా ఆదరిస్తారనే ఉద్దేశ్యంతో బాలయ్య బాబు ఇప్పుడు మాస్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను (Boyapti Srinu) డైరెక్షన్లో చేస్తున్న అఖండ 2 (Akhanda 2) సినిమా విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ n అయితే ఉంది. అఖండ సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడం. దానికి తోడు బోయపాటి బాలయ్య కాంబినేషన్లో ఇప్పటివరకు వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో ఆటోమేటిగ్గా నాలుగో సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంటుందనే ఒక కాన్ఫిడెంట్ తో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే బాలయ్య బాబు ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటికే ఈ మధ్య కాలం లో బాలయ్య వరుసగా నాలుగు విజయాలను సాధించాడు. దీంతో ఐదో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని తనకు తానే పోటీ తనతో ఎవ్వరు పోటీకి రాలేరు అనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే బోయపాటి బాలయ్య కాంబినేషన్ కి తిరుగుండదనే చెప్పాలి… సంక్రాంతి కానుకగా వచ్చిన ‘డాకు మహారాజు’ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
Also Read: కూలీ మూవీ మోనికా సాంగ్ లో డాన్స్ ఇరగదీసిన మంజుమ్మెల్ బాయ్స్ హీరో ‘సౌబిన్ షాహిర్’!
ఇక దానికి తోడుగా ఇప్పుడు ఈ సినిమాతో కూడా వచ్చి మరోసారి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటూ అనౌన్స్ అయితే చేశారు. ఇక ఇదిలా ఉంటే బాలయ్య బాబు మాస్ యాక్షన్ సినిమాలను చేస్తారని ఫ్యామిలీ సినిమాని చేసి సక్సెస్ ని సాధించే సాహసం చేయలేడనే ఉద్దేశ్యంతో చాలామంది అతన్ని విమర్శిస్తూ ఉంటారు.
నిజానికి బాలయ్య బాబు ఇప్పటివరకు ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను ఒక్కసారి కూడా చేయలేదు. ఒకవేళ చేసిన కూడా ఆ సినిమా ఆడుతుందా లేదా అనే గ్యారెంటీ అయితే లేదు. ఎందుకంటే బాలయ్య బాబుకి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. దాన్ని విడిచిపెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ సినిమా చేస్తాడు అనుకోవడం కరెక్ట్ కాదు.
ఎందుకంటే తన అభిమానులను సాటిస్ఫై చేసినప్పుడే ఆయన సినిమాలు సక్సెస్ లు సాధిస్తాయి. అలా కాకుండా తన వీక్ జోన్ లోకి వెళ్లి సినిమాలు చేయడం సరైనది కాదు అంటూ కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తన దగ్గరికి వచ్చే దర్శకులు సైతం ఫ్యామిలీ సినిమాలను చేయడానికి పెద్దగా ఇష్టపడడం లేదు… అందుకే ప్రస్తుతం బాలయ్య వరుసగా మాస్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు…