Kota Srinivasa Rao Final Role: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట శ్రీనివాసరావు గారికి నటుడిగా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రలను పోషించి గొప్ప నటుడిగా నిలిచాడు. మరి అలాంటి నటుడు ఇప్పుడు మన మధ్య లేకపోవడం అనేది నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేసే విషయం అనే చెప్పాలి. ఆయన తన కెరియర్ లో స్టార్ హీరోలందరితో కలిసి నటించాడు. ఆయన అందరితో చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే మైంటైన్ చేస్తూ వచ్చాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన మన మధ్య లేరు కాబట్టి ఆయన చివరగా చేసిన సినిమా ఏంటి అంటూ నెటిజన్లు ఆలోచిస్తున్నారు. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కోట శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ హరిహర వీరమల్లు’ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో అయితే నటించారట. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటిలో ఆ పాత్ర చాలా గొప్ప పాత్రగా నిలిచిపోతుందని కూడా చాలామంది చెబుతున్నారు. మరి అలాంటి పాత్రలో నటించిన కోట శ్రీనివాసరావు కి ఈ సినిమానే చివరి సినిమాగా అవుతుంది అంటూ మరి కొంతమంది సినిమా మేధావులు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు.
Also Read: Fish Venkat health update: ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే!
మొత్తానికైతే కోట శ్రీనివాసరావు కి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అయితే ఉందని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇక తన చివరి సినిమాని కూడా పవన్ కళ్యాణ్ తోనే ముగించడం అనేది అతనికి గొప్ప కీర్తి ప్రతిష్టను అందిస్తుందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఆయన ఈ సినిమాను గత మూడు సంవత్సరాల క్రితమే ఆ క్యారెక్టర్ అయితే పోషించారట.
మరి దానికి తగ్గట్టుగానే ఆయన డబ్బింగ్ ను కూడా అప్పట్లోనే పూర్తి చేసినట్టుగా సమాచారమైతే అందుతోంది. మరి ఏది ఏమైనా కోట శ్రీనివాసరావు చివరి సినిమాగా హరిహర వీరామల్లు సినిమా రావడం అనేది నిజంగా ఆయనకు గొప్ప గౌరవాన్ని అందించబోతుందనే చెప్పాలి. అయితే ఇందులో ఆయన పోషించిన పాత్ర కూడా పాజిటివ్ గానే ఉంటుందట.
Also Read: Kota Srinivasarao Passed Away: ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూత
ఈనెల 24 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న హరిహర వీరమల్లు సినిమాతో ఆయనకి ట్రిబ్యూట్ ను తెలియజేయడానికి సినిమా యూనిట్ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక దిగ్గజ నటుడిని కోల్పోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు…