Chiranjeevi And Srikanth Odela: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త దర్శకుల హవా కొనసాగుతుంది. మొదటి సినిమాతో సక్సెస్ ను సాధించిన దర్శకులను స్టార్ హీరోలతో పాటు ప్రొడ్యూసర్లు సైతం వదులుకోవడం లేదు. ఇక దసర సినిమాతో శ్రీకాంత్ ఓదెల సైతం ఇప్పుడు భారీ సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు. నానితో ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్న ఆయన ఆ తర్వాత చిరంజీవితో ఒక భారీ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ చెరుకూరి రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి తో పీరియాడికల్ డ్రామా సినిమా ను తెరకెక్కిస్తున్నారు. 1960 టైమ్ లోని సినిమా స్టోరీ రెడీ చేశారని అదే కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయబోతున్నామంటూ ఆయన హింట్ అయితే ఇచ్చాడు… ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఇప్పటికే ఊహగానాలైతే వేసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ‘ది ప్యారడైజ్’ సినిమా సక్సెస్ ఏ రేంజ్ లో ఉంటుందో దాన్ని బట్టి చిరంజీవి సినిమా మీద హైప్ కూడా అదే రేంజ్ లో క్రియేట్ అవుతుంది.
ఒకవేళ ప్యారడైజ్ సినిమా తేడా కొడితే మాత్రం చిరంజీవి సినిమా మీద అంచనాలు తగ్గే అవకాశాలైతే ఉన్నాయి… కాబట్టి ఏది ఏమైనా కూడా పారడైజ్ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాలనే ఉద్దేశ్యంతోనే రాత్రి పగలు శ్రీకాంత్ ఓదెల తన టీమ్ తో కలిసి కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఈ ఒక్క సినిమా తన కెరీర్ మొత్తం డిసైడ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా తన రేంజ్ ను మారుస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… గతంలో చిరంజీవి బర్త్ డే అప్పుడు చిరంజీవి ని ఉద్దేశించి శ్రీకాంత్ ఓదెల ఒక పోస్ట్ అయితే చేశాడు.
చిరంజీవిని చూసుకుంటూ పెరిగాము అతని వల్లే సినిమా ఇండస్ట్రీకి వచ్చాం… అలాంటి హీరో మన చేతిలో పడితే ఆయన్ని ఎలా చూపించాలో అలా చూపిస్తాను. అంటూ ఆయన చేసిన పోస్ట్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అలాగే అతనిలోని ఆ ఫైర్ చిరంజీవి సినిమాకి సెట్ అయితే కనక సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
