Star Heroes: మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను మూటగట్టుకుంటాయి. కారణం ఏదైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలని చూస్తున్న చాలామంది స్టార్ హీరోలు తమ కెరియర్ లో ఒక్కసారైనా ఇండస్ట్రీ హిట్ ను దక్కించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సంపాదించుకున్నప్పటికి ఇండస్ట్రీ హిట్లుగా కన్వర్ట్ కాలేకపోతాయి. కారణం ఏదైనా కూడా అలాంటి సినిమాలు చాలా వరకు భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ఇండస్ట్రీ హిట్ గా కన్వర్ట్ అయ్యే సమయానికి కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోతాయి అందువల్లే ఆ సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలువలేక పోతున్నాయి అనేది వాస్తవం…
జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో వచ్చిన ఆది, సింహాద్రి లాంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా కన్వర్ట్ అవుతాయని అందరు అనుకున్నారు. కానీ ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి కానీ ఇండస్ట్రీ హిట్లుగా మారలేకపోయాయి… మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన దూకుడు సినిమా సైతం ఇండస్ట్రీ హిట్ గా మారుతుంది అనుకున్నప్పటికి ఆ సినిమా భారీ సక్సెస్ ను సాధించలేకపోయింది.
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా సైతం ఇండస్ట్రీ హిట్ సాధించాల్సిన సినిమానే కానీ ఈ సినిమా కూడా అప్పుడు ఇండస్ట్రీ హిట్ గా మారలేకపోయింది. అప్పుడు మగధీర సినిమా కలెక్షన్స్ ను బ్రేక్ చేయలేక పోయింది… ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలందరు ఇప్పుడు వరుస సినిమాలను చేస్తూ ఇండస్ట్రీ హిట్లను కొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు.
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఇండస్ట్రీ ని సాధించడం అనేది మామూలు విషయం కాదు… ఇక రాబోయే సినిమాలతో మన స్టార్ హీరోలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు. తద్వారా ఇండస్ట్రీలో ఎవరు నెంబర్ వన్ హీరోగా మారుతారు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
