Chiranjeevi And Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సీనియర్ హీరోల హవా కొనసాగుతుంది. వారి నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. దాంతో యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి – బాలయ్య బాబుల మధ్య ఎప్పటినుంచో తీవ్రతరమైన పోటీ అయితే ఉంది. కెరియర్ మొదటి నుంచి కూడా వీళ్ళ సినిమాల మధ్య పోటీ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు డామినేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి సినిమాల మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉంటున్నాయి. ఇక రీసెంట్గా చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధిస్తే బాలయ్య బాబు మాత్రమే ‘అఖండ 2’ తో ప్లాప్ ను మూట గట్టుకున్నాడు…
ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో ఒక గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో సినిమాని చేస్తున్నాడు… కలకత్తా బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమాలో అనస్వర రాజన్ చిరంజీవి కూతురుగా నటిస్తోంది. మోహన్ లాల్ సైతం ఇందులో కీలకపాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకి ‘కాక’ లేదా ‘కాకాజీ’ అనే టైటిల్ ని ఫైనల్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుందట…
ఇక బాలయ్య బాబు గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న సినిమా కూడా గ్యాంగ్ స్టార్ నేపథ్యంలోనే తెరకెక్కుతూ ఉండడం విశేషం… ఈ కాంబినేషన్లో ఇంతకుముందు వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఆ మూవీ మంచి విజయాన్ని సాధించడంతో మరోసారి వీళ్లిద్దరూ జతకడుతున్నారు. ఇక కమర్షియల్ సినిమాలని చాలా అద్భుతంగా తెరకెక్కించగలిగే దర్శకులలో గోపీచంద్ మలినేని కూడా ఒకరు కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులందరికి మంచి అంచనాలైతే ఉన్నాయి…
ఇక ప్రస్తుతం చిరంజీవి – బాలకృష్ణ ఇద్దరు కూడా సీనియర్ హీరోలు అవ్వడం ఇద్దరు ఒకే బ్యాక్ డ్రాప్ తో సినిమాను చేస్తుండడం వల్ల వీళ్ళిద్దరి నుంచి వచ్చే సినిమాల్లో ఏ మూవీ సూపర్ సక్సెస్ సాధిస్తుంది. ఏ సినిమా డీలా పడిపోతుంది అనే విషయంలోనే చాలావరకు ప్రేక్షకుల్లో కొన్ని తలెత్తుతున్నాయి…ఇక వీటన్నింటిలో ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనే ప్రశ్న కి చెక్కు పెట్టాలంటే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…