Anasuya Bharadwaj: క్రేజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ కి సుకుమార్ ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర ఇవ్వడం వెనుక కారణం ఏమిటి ? అని ఎవ్వరూ అడగలేదు. ఆ పాత్రకు ఆమె సూట్ అవుతుంది కాబట్టి ఇచ్చాడు అని అనుకున్నారు. ఇక పుష్ప సినిమాలో కూడా నెగిటివ్ యాంగిల్ లో అనసూయను చూపించాడు. పైగా పుష్ప 2 లో అయితే మెయిన్ లేడీ విలన్ గా అనసూయను సుకుమార్ ప్రమోట్ చేస్తున్నాడు.

కేవలం, తన సినిమాలకే కాదు.. తన సన్నిహితుల సినిమాల దగ్గర నుంచి తన మాట వినే నిర్మాతలు, డైరెక్టర్ల వరకూ అందరికీ అనసూయను రికమండ్ చేస్తున్నాడు. సరే.. ఆమె నటన అంటే సుకుమార్ కి ఇష్టం ఏమో అని అందరూ సరిపెట్టుకున్నారు. కానీ..ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. మెగాస్టార్ చిరంజీవి పక్కన కూడా అనసూయను తీసుకొచ్చి పెట్టడం.. సుక్కు సన్నిహితులు, మిత్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
Also Read: AP Online Ticketing: మెగా ఫ్యామిలీకి ‘ఏపీ ఆన్ లైన్ టికెట్’ టెండర్ ఎందుకు ఆపేశారు?

సుకుమార్ ‘శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థ’ కోసం ఒక యాడ్ చేశాడు. ఈ యాడ్ లో చిరు కూడా నటించడానికి అంగీకరించాడు. మరి చిరు అంగీకరించినప్పుడు.. ఆయన పక్కన ఎవరు అయితే బాగుంటారు ? మెగాస్టార్ రేంజ్ కి తగ్గ నటిని పెట్టాలి కదా. కానీ సుకుమార్ మాత్రం తనకు ఇష్టమైన అనసూయను తీసుకొచ్చి పెట్టాడు.

ఇక చిరు పక్కన అనసూయ ఐటమ్ భామలా ఒదిగిపోయింది. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కూడా. కానీ సుకుమార్ – అనసూయ బంధం పై కూడా ప్రస్తుతం పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని, అందుకే.. అనసూయకి సుక్కు వరుస అవకాశాలు ఇస్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారు.

నిజంగానే సుకుమార్ స్వయంగా అనసూయను రికమెండ్ చేసి మరీ ఛాన్సులు ఇప్పిస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా గమనిస్తోన్న వారు.. ఈ స్టార్ డైరెక్టర్ అనసూయ మోజులో పడిపోయాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ హాట్ టాపిక్ పై సుక్కు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Also Read:Online Ticket Portal Tender Issue: ఆ కాంట్రాక్ట్ మెగా ఫ్యామిలీకి వస్తుందా ? రాదా ?
[…] […]