Chiranjeevi 157: నేడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం. ఆయన 68 ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్ట్స్ ప్రకటించారు. వాటిలో సుస్మిత బ్యానర్ లో ఒక చిత్రం. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఆమె ప్రొడక్షన్ హౌస్లో చిరంజీవి ఒక చిత్రం ప్రకటించారు. అయితే దర్శకుడు ఎవరో వెల్లడించలేదు. నిజానికి ఈ ప్రాజెక్ట్ కి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు అనుకున్నారు. త్రిష హీరోయిన్ గా శర్వానంద్ మరో హీరోగా ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యింది. అయితే భోళా శంకర్ ఫలితంతో సందిగ్ధంలో పడింది.
కళ్యాణ్ కృష్ణ స్థానంలో తమిళ దర్శకుడు మురుగదాస్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మెగా 157 మాత్రం క్రేజీ డైరెక్టర్ తో ప్రకటించారు. బింబిసార చిత్రంతో యంగ్ డైరెక్టర్ వశిష్ట్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. హీరో కళ్యాణ్ రామ్ కి మరపురాని విజయం అందించాడు. బింబిసార చిత్రంతో ఇంప్రెస్ అయిన చిరంజీవి వశిష్ట్ కి ఆఫర్ ఇచ్చారంటూ ప్రచారం జరిగింది.
నేడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. చిరంజీవి 157వ చిత్ర అనౌన్స్మెంట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తుంది. పోస్టర్లో పంచభూతాలైన గాలి, నీరు, నేల, నిప్పు, ఆకాశం ఉన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించడం మరొక విశేషం. పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యే అవకాశం కలదు. కాన్సెప్ట్ పోస్టర్ ఆకట్టుకున్న నేపథ్యంలో అంచనాలు పెరిగిపోయాయి. చిరంజీవి ఈ చిత్రంతో సంచనాలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
రీమేక్స్ చిత్రాలు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొన్న చిరంజీవి వశిష్ట్ మూవీతో సమాధానం చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక మెగా 157 చిత్ర ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. బర్త్ డే వేళ చిరంజీవి రెండు చిత్రాలు ప్రకటించారు. వచ్చే ఏడాది ఈ రెండు చిత్రాలు విడుదలయ్యే సూచనలు కలవు. ఏక కాలంలో చిరంజీవి ఈ ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో చిరంజీవి పాల్గొననున్నారని వినికిడి.