మీ స్ఫూర్తితో ఆ కామాంధుడికి శిక్ష పడేలా చేశా !

గత కొన్ని సంవత్సరాలుగా తన వేధింపుల పురాణాల గురించి ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా చెప్పిందే చెబుతూ వస్తోంది ‘చిన్మయి శ్రీపాద’. గాయనీగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తెచ్చుకున్న పాపులారిటీ కంటే కూడా, తానూ ఎదుర్కొన్న వేధింపులను కథలుకథలుగా చెప్పే ఆమె ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని ఆమె పై విమర్శలు ఉన్నప్పటికీ.. నిజానికి తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్మయి, ‘మీటూ’ ఉద్యమాన్ని సౌత్ లో ముందుకు తీసుకు వెళ్ళిన వీర వనితగా కూడా ఆమెకు ఎక్కువ గుర్తింపు ఉంది. […]

Written By: admin, Updated On : May 13, 2021 6:42 pm
Follow us on

గత కొన్ని సంవత్సరాలుగా తన వేధింపుల పురాణాల గురించి ఎపిసోడ్లు ఎపిసోడ్లుగా చెప్పిందే చెబుతూ వస్తోంది ‘చిన్మయి శ్రీపాద’. గాయనీగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తెచ్చుకున్న పాపులారిటీ కంటే కూడా, తానూ ఎదుర్కొన్న వేధింపులను కథలుకథలుగా చెప్పే ఆమె ఎక్కువ పేరు ప్రఖ్యాతలు సంపాదించిందని ఆమె పై విమర్శలు ఉన్నప్పటికీ.. నిజానికి తన గాత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్మయి, ‘మీటూ’ ఉద్యమాన్ని సౌత్ లో ముందుకు తీసుకు వెళ్ళిన వీర వనితగా కూడా ఆమెకు ఎక్కువ గుర్తింపు ఉంది.

అయితే బయట ఆడవాళ్ల పై జరుగుతోన్న అక్రమాలను ప్రశ్నించడంలో ఆమె గొంతుక ఎప్పుడు ముందే ఉంటుంది. పైగా బాధిత మహిళలకు, అలాగే బాధిత బాలికలకు కూడా చిన్మయి ఆదర్శంగా నిలవడం నిజంగా విశేషమే. తమ పట్ల జరిగిన అఘాయిత్యాల పై కూడా నోరు మెదిపేందుకు దైర్యం లేని వారికి, తానే బాసటగా నిలిచి, వారిలో ధైర్యాన్ని నూరిపోసింది చిన్మయి. దాంతో చిన్మయి స్ఫూర్తితో బయటకు వచ్చి తమ బాధను చెప్పుకున్న ఆడవాళ్లు ఎందరో ఉన్నారు.

తాజాగా ఓ అమ్మాయి కూడా తనకు జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులతో దైర్యంగా చెప్పానని, అలాగే ఆ కామాంధుడికి శిక్ష పడేలా చేశానని, మీ స్ఫూర్తి వల్లే ఇంత ధైర్యం చేశానని చిన్మయికి ఓ లెటర్ రాసింది ఆ అమ్మాయి. ఆ లెటర్ లో సారాంశం ఇలా ఉంది. ‘మీరు నిజంగా మాలాంటి వాళ్లకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్నారు మేడం (చిన్మయి). నేను నా చిన్నతనం నుంచి లైంగిక వేధింపులకు గురవుతూ వస్తున్నాను. మా కజిన్స్ లో ఒక నీచుడు నా పై చాలాసార్లు అత్యాచారం జరిపాడు.

ఈ విషయం గురించి మా అమ్మనాన్నలతో మాట్లాడటానికి నేను ఎంతో భయపడేదాన్ని. కానీ మిమ్మల్ని, మీ పోస్ట్ లను ఫాలో అయ్యాక, ధైర్యం చేసి నా పట్ల జరిగిన ఘోరాన్ని అందరికీ చెప్పేశాను. కానీ ఈ విషయం బయట మాట్లాడొద్దని నన్ను నా వాళ్లే హెచ్చరించారు. ఎంతో నిరాశకు లోనయ్యాను. అయితే మీ పోరాటం నాలో ధైర్యాన్ని నింపింది. ఆ ఆకతాయి చేసిన పనికి పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాడికి సరైన శిక్ష పడేలా చేశాను. మా లాంటి ఎందరికో మీరు గొంతుకలా నిలిచినందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ ఆ లెటర్ లో రాసి ఉంది. ఈ లెటర్ ను చిన్మయి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.