
‘అతిలోక సుందరి శ్రీదేవి’కి ఒక చిరకాల కోరిక ఉందట. తన చిన్న కూతురిని పెద్ద హీరోయిన్ ను చేయాలని. చిన్నప్పటి నుండి పెద్ద కూతురు జాన్వి కపూర్ బాగా యాక్టివ్ గా ఉంటుంది. పైగా సినిమాల్లోకి ముందుగా ఎంట్రీ ఇస్తోంది కాబట్టి, పెద్దగా కష్టపడకుండానే, తనకున్న స్టార్ డమ్ తన పెద్ద కూతురికి వచ్చేస్తోంది అని శ్రీదేవి ఎప్పుడూ అంటుండేది అట. అందుకే శ్రీదేవి తన చిన్న కూతురు గురించే ఎక్కువ ఆలోచిందట.
కట్ చేస్తే.. అంతా శ్రీదేవి ఊహించినట్టుగానే జరుగుతుంది. జాన్వీ కపూర్ కి శ్రీదేవి స్టార్ డమ్ బాగా కలిసొచ్చింది. ఎక్కువ కష్టపడకుండానే ఆమెకు కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం జాన్వీ రెండు చేతుల నిండా సంపాదిస్తోంది. అయితే, ఇక్కడ జాన్వీను తక్కువ చేయలేం, అందంలో తల్లికి తగ్గ తనయ అనిపించుకుంది.
పైగా పర్ఫెక్ట్ బాడీ స్ట్రక్చర్ తో పాటు ఎక్స్ పోజింగ్ లో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా చక్కగా దర్శకులు కోరినట్టు ముందుకు పోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజీ యంగ్ బ్యూటీగా ఫుల్ బిజీగా కెరీర్ ను కొనసాగిస్తోంది జాన్వీ. అయితే శ్రీదేవి చిరకాల కోరిక మాత్రం ఇంకా తీరలేదు. పెద్ద కూతురు ఎంత సక్సెస్ సాధించినా శ్రీదేవికి ఎక్కువ సంతోషాన్ని కలిగించదు అని బోనికపూర్ కూడా ఫీల్ అవుతున్నాడట.
అందుకే చిన్న కూతురు ఖుషీ కపూర్ ఎంట్రీకి రంగం సిద్ధం చేస్తోన్నాడు. అయితే ఈ యంగ్ బ్యూటీకి కొంచెం అందచందాలు తక్కువ, అందుకే ఖుషీ కపూర్ కి ఇప్పటికే ఒక సర్జరీ కూడా చేయించాడు బోని కపూర్. అలాగే ఆ మధ్య ఖుషీ కపూర్ మళ్ళీ తన పెదవి కింద మరో సర్జరీ కూడా చేయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బాడీకి సంబంధించి చిన్నపాటి సర్జరీలు కూడా చేయించుకుందట. మొత్తానికి ఖుషీ కపూర్ పర్ఫెక్ట్ బాడీతో వచ్చే ఏడాది సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. అక్క బాటలో అరంగేట్రం చేసి ఖుషి సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.