Chinmayi Sripaada- Nayanthara: ఈ మధ్య నయనతార పేరు మీడియాలో మారుమోగుతోంది. నాలుగు నెలల కిందట డైరెక్టర్ విఘ్నేశ్ ను పెళ్లి చేసుకున్న ఈమె ఇటీవల కవలపిల్లలకు తల్లయింది. అయితే నేరుగా కాకుండా సరోగసి పద్ధతి ద్వారా నయన్ దంపతులు కవలలకు జన్మనిచ్చారు. సాధారణంగా పెళ్లయిన ఐదేళ్లవరకు పిల్లలు కాకపోతే సరోగసి పద్ధతిని ఆశ్రయించాలి. అంతకంటే ముందే దీనిని ఆశ్రయిస్తే నేరమవుతుంది. కానీ నయనతార – విఘ్నేష్ లు మాత్రం పెళ్లయిన నాలుగు నెలలకే సరోగసి పద్ధతి ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. దీనిపై కొందరు ఫిర్యాదు చేయగా ఆ ఇష్యూ కోర్టులో నడుస్తోంది.

ఈ తరుణంలో కొందరు నయనతార గురించి రకరకాల పోస్టులు పెట్టి విమర్శలు చేస్తున్నారు. పెళ్లయిన నాలుగునెలలకే పిల్లలకు జన్మనివ్వడమేంటి..? కొన్ని రోజులు ఆగలేకపోయారా..? అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా ఇదే సమయంలో ప్రముఖ గాయని చిన్మయి కూడా కవలలకు జన్మనిచ్చింది. అయితే చిన్మయి కూడా సరోగసి ద్వారానే పిల్లలకు జన్మనిచ్చిందా..? ఆమెకు సంబంధించిన ప్రెగ్నెన్సీ ఫొటోలు ఎప్పుడూ కనిపించలేదు..? అని కొందరు సోషల్ మీడియాలో ఆమెను నయన్ తో పోల్చిన ఫొటులు పెట్టి కామెంట్స్ చేశారు. ఈ పోస్టులకు చిన్మయ వెంటనే రియాక్టయింది.
గతంలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం సినిమా ఇండస్ట్రీని కుదిపేసింది. చిత్ర పరిశ్రమలో కొందరు అవకాశాల పేరు చెప్పి క్యాస్టింగ్ కౌచ్ కు పాల్పడ్డారని నటులతో పాటు కొందరు గాయనీలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ వ్యవహారంలో ముందుగా చిన్మయి తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియా వేదికగా ఇతరులతో పంచుకుంది. ఆ సమయంలో చిన్మయిపై కూడా కొందరు తీవ్ర విమర్శలు చేశారు. అప్పటి నుంచి చిన్మయి ఎలాంటి కామెంట్ చేసినా వైరల్ అవుతోంది. లెటేస్టుగా ఈ గాయని తనపై విమర్శలు రాగా.. వాటికి చెక్ పెడుతూ సంచలన పోస్టులు పెట్టింది.

తాను ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి ఫొటోలను, వీడియోను సోషల్ మీడియాకు షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమె ఓ మెసేజ్ కూడా పెట్టింది. ‘ఇంతకాలం ఫ్యామిలీ, పర్సనల్ విషయాలను బటయపెట్టొదని ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫొటోలను షేర్ చేయలేదు. నేను అందరిలాగా తప్పులు చేయను… అని అందులో రాసుకొచ్చింది. అయితే మెసేజ్ నయనతార -విఘ్నేశ్ లనను ఉద్దేశించేనని కొందరు అంటున్నారు. ఎందుకంటే నయనతార, చిన్మయిల మధ్య గతంలో సోషల్ వార్ నడిచింది. ఇప్పుడు వీరిద్దరికి పోలిక పెట్టి కొందరు పోస్టులు పెట్టడంతో ఆమె ఆగ్రహం చెంది ఇలా రిప్లై ఇచ్చింది. దీంతో చిన్మయి పోస్టుపై హాట్ హాట్ గా చర్చలు పెట్టుకుంటున్నారు.