తమిళ సినీ పరిశ్రమలో మొదలైన మీటూ ఉద్యమం అనేక వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా ప్రముఖ సింగర్ చిన్మయి పలువురు మీద లైంగిక దాడుల ఆరోపణలు చేసింది. ప్రధానంగా రచయిత వైరముత్తు మీద తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆమె వెనకే అనేకమంది తారలు బయటికొచ్చారు. తాము కూడ కాస్టింగ్ కౌచ్ వలన ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చారు. బాలీవుడ్ వరకు వెళ్ళింది ఈ సోషల్ మీడియా ఉద్యమం. ఈ ఉద్యమంతో చిన్మయి మీద తమిళ పరిశ్రమలో పలు నిషేధాలు కూడ విధించబడ్డాయి.
Also Read: పవన్ రెమ్యునరేషన్ రోజుకు అంత తీసుకుంటున్నాడా..!
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఆమెకు అవకాశాలు తగ్గాయి. అయినా ఆమె వెనకడుగు వేయలేదు. సందర్భం దొరికినప్పుడల్లా మీటూ గురించి, బాధితుల గురించి లేదా తప్పు చేసిన వ్యక్తుల గురించి స్పందిస్తూనే ఉంది. ఇప్పటికే పలు ప్రాజెక్టులకు ఈ మీటూ సెగ తగలగా తాజాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కూడ వివాదంలోకి లాగబడ్డారు. అదెలాగంటే.. మణిరత్నం నిర్మాతగా ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. ఇందులో మొత్తం తొమ్మిది కథలుంటాయి . వీటిని తొమ్మిది మంది దర్శకులు డైరెక్ట్ చేయనున్నారు.
Also Read: బాలయ్య వచ్చేశాడు.. ఇక మిగిలింది మెగాస్టారేనా..!
కార్తీక్ సుబ్బరాజ్, గౌతమ్ మీనన్, కేవీ ఆనంద్, అరవిందస్వామి, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్, బిజోయ్ నంబియార్, పొన్‌రామ్, హలిత షలీమ్ ఈ దర్శకుల జాబితాలో ఉన్నారు. అలాగే పలువురు సంగీత దర్శకులు కూడ పనిచేస్తుండగా సింగర్ కార్తీక్ కూడ ఇందులో పనిచేయనున్నారు. అది తెలుసుకున్న చిన్మయి వేధింపులకు గురిచేసిన వ్యక్తికి అండగా నిలబడటం, అతనికి పని కల్పించడం బాధాకరమని, తనలాంటి బాధితులు పనిలేక ఇబ్బందులు పడుతున్నారని మణిరత్నంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలకు కొందరు నెటిజన్లు మద్దతు పలకడం గమనార్హం.