Chiranjeevi: మన దేశంలో అత్యున్న పౌర పురస్కారం భారత రత్న. దాని తర్వాత స్థానం పద్మ పురస్కారాలదే. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ఈ పురస్కారాలను ప్రకటిస్తోంది. ఈసారి కూడా జనవరి 25న పద్మ పురస్కారాలు ప్రకటించింది. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్‌ను ఈసారి పద్మ విభూషణ్ వరించింది. దీంతో మెగా కుటుంబంతోపాటు ఫ్యాన్స్, తెలుగు ప్రజలు ఖుషీ అవుతున్నారు. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నేతల నుంచి చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఇప్పటికే ఆయనను కలిసి సన్మానించారు.
పార్టీ ఇచ్చిన మెగాస్టార్..
తనకు పద్మ విభూషన్ అవార్డు వచ్చిన సంరద్భంగా మెగాస్టార్ చిరంజీవి శనివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేశారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ప్రత్యేక ఆహ్వానం మేరకే సీఎం చిరు పార్టీకి వెళ్లారు. మొదట మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తర్వావత ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. పవర్ స్టార్ రామ్‌చరణ్‌తో ముచ్చటించారు. తర్వాత విందు ఆరగించారు.
సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో..
ఇక మెగాస్టార ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి ఫొటోలు, వీడియోను రేవంత్‌రెడ్డి ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘శ్రీ చిరంజీవి గారికి అవార్డు రావడం మనందరికీ గర్వకారణం, వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని చెప్పారు. దీనికి బదులుగా చిరంజీవి ’నన్ను అభినందించిన ముఖ్యమంత్రి శ్రీరేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు’ అని చెప్పారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంవో ఎక్స్‌లో తెలిపింది. అలాగే, కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది.
#WATCH | Hyderabad: Telangana CM Revanth Reddy attended a dinner hosted by actor Chiranjeevi and congratulated him for receiving Padma Vibhushan. CM also met Chiranjeevi’s son and actor Ram Charan. (03/02) pic.twitter.com/yBi3qEZwPO
— ANI (@ANI) February 4, 2024