Chhatrapati Shekhar: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు చేస్తున్న సినిమాలకు ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ఉంటుంది. వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటి క్రియేట్ అవుతోంది… అందుకే వాళ్ళకోసం అభిమానులు కొట్టుకు చస్తుంటారు.ఇక హీరోల విషయం పక్కన పెడితే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించే వాళ్లకు సైతం చాలా మంచి ఇమేజ్ ఏర్పడుతోంది. ఛత్రపతి సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ఛత్రపతి శేఖర్…ఆ మూవీ సక్సెస్ తర్వాత ఆయన చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్ లను పోషించాడు. రాజమౌళి చేస్తున్న ప్రతి సినిమాలో ఆయన ఒక కీలకమైన పాత్రలో నటిస్తుంటాడు. తద్వారా ఆయనకు మంచి ఇమేజ్ రావడమే కాకుండా మంచి సినిమాలు చేశాననే సాటిస్ఫాక్షన్ కూడా ఉందని పలు సందర్భాల్లో ఆయన తెలియజేశాడు.
Also Read: పవన్ స్టైల్ మారింది.. ఏంటీ కొత్త సంకేతం?
ఇక రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సీరియల్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుతూ సీరియల్ ఆర్టిస్టులు ప్రామింటింగ్ లేకుండా ఏ చిన్న డైలాగ్ చెప్పారని కనీసం రెండు లైన్లు డైలాగులు కూడా చెప్పలేకపోతే ఆర్టిస్టులుగా మనం ఉండి ఎందుకు అంటూ ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన సీరియల్స్ లో బిజీగా ఉంటున్నాడు.
సిట్టింగ్ లో తన పని చూసుకొని షాట్ గ్యాప్ లో ఎవరితో మాట్లాడకుండా పక్కన కారు లో కూర్చొని తన పని తను చేసుకుంటారట. కారణం ఏంటి అంటే సీరియల్ ఆర్టిస్టులతో కలిసిపోతే తను కూడా వాళ్ల లా తయారైపోతానేమో అనే ఉద్దేశ్యంతోనే ఆయన అలా ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటారట. మొత్తానికైతే ఛత్రపతి శేఖర్ చెప్పిన దాని ప్రకారం సీరియల్ ఆర్టిస్టులు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా లేదా అని ఆలోచిస్తారు తప్ప నటులుగా మనం ఇంకా అప్డేట్ అవుతున్నామా? లేదా మనం ఎలాంటి మెలుకులు నేర్చుకోవాలి అనే విషయాన్ని ఎవరు పట్టించుకోరు.
అందుకే సీరియల్ ఆర్టిస్టులకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదంటూ ఆయన ఒక సంచలమైన కామెంట్ కూడా చేశాడు. మొత్తానికైతే శేఖర్ అటు సీరియల్స్, ఇటు సినిమాలు చేసుకుంటూ బిజీగా తన లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు… తను మాత్రం సీరియల్స్, సినిమా అనే తేడా లేకుండా మంచి క్యారెక్టర్ ఎక్కడుంటే అక్కడ చేస్తానని చెప్పాడు…