Chandrababu And Jagan: రాజకీయాల్లో సీనియారిటీ చాలా గుణపాఠాలు నేర్పుతుంది. కేవలం ప్రజలకు పాలన అందించడమే కాదు. వారి దృష్టిని ఆకర్షించగలగాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy) వ్యూహం దెబ్బతీసింది. రాజకీయాలకు అతీతంగా పథకాలు అమలు చేశామని ఆయన భావించారు. ప్రజలకు అన్ని ఇచ్చేసామని.. ప్రజలు తప్పకుండా తనను ఆదరిస్తారని నమ్మారు. తనను చూసి ఓటేస్తారని భావించారు. కేవలం ఎమ్మెల్యేలు తనకు, ప్రజలకు మధ్య వారధులు అని.. వారితో పని ఏమి అన్నట్టు వ్యవహరించారు. ఈ క్రమంలో ప్రజలకు అడ్డంగా బుక్కయ్యారు. సింగిల్ విండో పాలన అనేది కరెక్ట్ కాదు అని జగన్మోహన్ రెడ్డి పాలనతో అర్థమయింది. దానిని ప్రజలు ఎంత మాత్రం హర్షించరని తేలిపోయింది. అయినా సరే జగన్ వైఖరిలో మార్పు రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను వినియోగించుకోలేదు. ఇప్పుడు విపక్షంలో ఉంటే మీరు పోరాటాలు చేయండి.. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
Also Read: పవన్ స్టైల్ మారింది.. ఏంటీ కొత్త సంకేతం?
* జగన్ సోలో ఫర్ఫార్మెన్స్..
గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో( welfare schemes) మెరుగైన పాలన అందించానని చెబుతున్నారు. కానీ అభివృద్ధి అనేది కనిపించకపోవడంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. కనీసం ఆదరించలేదు కూడా. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సోలో పర్ఫార్మెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. తనకు ప్రజలకు మధ్య నిమిత్తమాత్రులు అన్నట్టు ఎమ్మెల్యేలను చులకనగా చూశారు. సచివాలయం తో పాటు వాలంటరీ వ్యవస్థ అనేది తన కింద పనిచేసే వ్యవస్థలా మార్చేశారు. పాలన అంటే కేవలం బటన్ నొక్కడమే అన్నట్టు వ్యవహరించారు. దాని పర్యవసానాలను అనుభవించారు. ఇచ్చేది నేనే.. ప్రజలు నన్నే చూస్తారు.. నా దుక్కు చూసి ఓటు వేస్తారు అన్నట్టు వ్యవహార శైలి ఉండేది జగన్మోహన్ రెడ్డిలో. కానీ ఆయన ఆలోచన తప్పు అని ప్రజలు తమ తీర్పుతో గట్టి హెచ్చరికలే పంపారు.
* అందరి భాగస్వామ్యంతో చంద్రబాబు..
అయితే చంద్రబాబు( AP CM Chandrababu) విషయంలో అలా కాదు. చేసింది చూపెడతారు. చేసింది కచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల కోసమే పనిచేస్తున్నట్లు చంద్రబాబు చెప్పినట్టుగా మరొకరు చెప్పలేరు కూడా. ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తారు చంద్రబాబు. అధికారులతో మమేకమై పని చేస్తారు. అలాగని పూర్తిగా అధికార యంత్రాంగం పై ఆధారపడరు. కింది స్థాయిలో తుఫాన్ సహాయం నుంచి పింఛన్లు పంపిణీ వరకు.. పార్టీ శ్రేణుల భాగస్వామ్యం ఉండాలని బలంగా కోరుకుంటారు. అందుకే పార్టీ శ్రేణులు సైతం నాయకత్వం పట్ల నిబద్ధతతో ఉంటారు. 2019లో ఘోర పరాజయం తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోలుకోవడానికి మూడేళ్లు పట్టింది. కానీ చంద్రబాబు నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణులకు విపరీతమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు చంద్రబాబు. జగన్లో ఆలోపమే చంద్రబాబు ప్లస్ గా మార్చుకున్నారు.