Chhaava Movie : ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) కొడుకు శంభాజీ మహారాజ్(Sambhaji Maharaj) జీవిత చరిత్ర ని ఆధారంగా చేసుకొని, భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘చావా'(Chhaava Movie) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా 500 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, 600 కోట్ల రూపాయిల వైపు పరుగులు తీస్తుంది. అయితే ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ దేశవ్యాప్తంగా చూసిన జనాలు సోషల్ మీడియా లో రివ్యూస్ ఇవ్వడంతో మన ఆడియన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో దబ్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేసారు. ఈ డిమాండ్ ని బాగా గమనించిన అల్లు అరవింద్(Allu Aravind) గీత ఆర్ట్స్ సంస్థ, ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేసి, రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేయబోతున్నారు.
అయితే ఈ సినిమాకి ఒక చిన్న సమస్య వచ్చి చేరింది. నెల్లూరు జిల్లాలో ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (MFAP) జిల్లా కలెక్టర్ ని కలిసి ‘చావా’ తెలుగు వెర్షన్ రిలీజ్ ని నిలిపివేయాలని వినతి పత్రం అందచేసాడు. ముస్లిమ్స్ మనోభావాలను కించ పరిచే విధంగా, సమాజం లో మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఈ సినిమా ఉందని, నేటి యువతకు ఇలాంటి సినిమాలు హానికరమని , దయచేసి విడుదలను ఆపివేయాలి అంటూ కలెక్టర్ కి విన్నవించుకున్నారు. మరి కలెక్టర్ దానికి ఎలాంటి రెస్పాన్స్ ఇచ్చాడు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయనకు ఈ సినిమాని ఆపే ఉద్దేశ్యమే ఉంటే, ఈపాటికి ఉత్తర్వులు కూడా జారీ అయ్యేవి. కానీ అలాంటిదేమి జరగలేదు కాబట్టి, నిశ్చింతగా ఈ సినిమా రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది. హిందీ లో సంచలనం సృష్టించిన ఈ సినిమా తెలుగు లో ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.
చరిత్ర గురించి తెలియని వాళ్లకు, ఈ సినిమా నేపథ్యం గురించి టూకీగా కొన్ని వివరాలు అందిస్తున్నాము. అప్పట్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దేశం లో ఉన్న అన్ని రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. కానీ మరాఠా రాజ్యాన్ని ముట్టుకోలేకపోయాడు. కారణం ఛత్రపతి శివాజీ. ఆయన కంఠం లో ప్రాణం ఉన్నంత వరకు ఔరంగ జేబు మరాఠా సామ్రాజ్యం దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. ఆయన చనిపోయాక మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి తన ప్రచండ సైన్యం తో బయలుదేరాడు. కానీ శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ ధాటికి వేలమంది ఔరంగజేబు సైన్యం మట్టిలో కలిసిపోయింది. తండ్రిని మించిన యోధుడిగా పేరు తెచ్చుకున్న శంభాజీ మహారాజ్ కి వెన్నుపోటు పొడిచి , అతన్ని ఇస్లాం మతంలోకి మారాల్సిందిగా చిత్ర హింసలు పెడుతాడు ఔరంగజేబు. ఎన్ని చిత్ర హింసలు పెట్టినా, వీరోచితంగా నిలబడి ప్రాణాలు వదిలిన ధీరుడిగా నిల్చి శంభాజీ మహారాజ్ తండ్రిని మించిన యోధుడిగా నిలిచాడు. ఇదంతా ఎంతో అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చూపించాడు డైరెక్టర్ లక్ష్మణ్.
Also Read : చావా’ తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే మతి పోవాల్సిందే..అల్లు అరవింద్ అదృష్టం మామూలుగా లేదు!