Chhaava
Chhaava : సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా బాలీవుడ్ చిత్రం ‘చావా'(Chhaava Movie) గురించే చర్చలు నడుస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన ఈ సినిమాకి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో, బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. కేవలం వీకెండ్ లోనే కాదు, వర్కింగ్ డే అయినటువంటి సోమవారం రోజున కూడా ఈ చిత్రానికి 24 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. హిందీ భాషలో కాకుండా, ఈ చిత్రం మరో భాషలో డబ్ అయ్యి విడుదల కాలేదు. అయినప్పటికీ సింగిల్ లాంగ్వేజ్ నుండి ఈ రేంజ్ వసూళ్లు రావడం అనేది సాధరణమైన విషయం కాదు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా నటించిన విక్కీ కౌశల్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఎవరీ ఈ విక్కీ కౌశల్, అతని నేపథ్యం ఏమిటి అని నెటిజెన్స్ గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు.
కెరీర్ ప్రారంభంలో విక్కీ కౌశల్ సపోర్టింగ్ రోల్స్ ద్వారానే పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హీరో గా మారి కొన్ని సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు కానీ, అతని గొప్ప బ్రేక్ దొరికింది మాత్రం ‘URI’ చిత్రం తోనే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద అప్పట్లో సంచలనం సృష్టించడమే కాకుండా, విక్కీ కౌశల్ కి నేషనల్ అవార్డుని కూడా తెచ్చిపెట్టింది. ఈ చిత్రం తర్వాత ఆయనకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా యూత్ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యే సినిమాలు చేస్తూ తక్కువ సమయంలోనే స్టార్ హీరో గా మారిపోయాడు. ఇప్పుడు ‘చావా’ చిత్రంతో ఎవ్వరూ అందుకోనంత ఎత్తుకి ఎదిగిపోయాడు. అయితే విక్కీ కౌశల్ కూడా బ్యాక్ గ్రౌండ్ సపోర్టు తోనే ఇండస్ట్రీ లోకి వచ్చాడు.
ఈయన తండ్రి పేరు శ్యామ్ కౌశల్(Shyam Kaushal). బాలీవుడ్ లో ఈయన పలు యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించాడు. అంతే కాకుండా మంచి స్టంట్ మాస్టర్ కూడా. ఇప్పటి వరకు ఆయన ‘3 ఇడియట్స్’, ‘ఓం శాంతి ఓం’, ‘క్రిష్ 3’, ‘ఫాన్తుమ్’, ‘కాబిల్’ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు స్టంట్ మాస్టర్ గా పని చేసాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ కి కూడా ఈయన పలు యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫర్ గా పని చేసాడు. మార్చి 28 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే విధంగా పలు టాలీవుడ్ సినిమాలకు కూడా ఆయన స్టంట్ మాస్టర్ గా వ్యవహరించడానికి ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఒక ఫేమస్ స్టంట్ మాస్టర్ కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చిన విక్కీ కౌశల్, నేడు ఈ రేంజ్ కి ఎదగడం అనేది మామూలు విషయం కాదు.