Niharika Konidela
Niharika Konidela : మెగా బ్రదర్ నాగబాబు(Nagababu Konidela) కూతురు నిహారిక కొణిదెల(Niharika Konidela) సినీ ప్రస్థానం ఎలా సాగిందో మనమంతా చూసాము. ముందుగా ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలు చేసింది. కానీ అవి కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యాయి. ఇక ఆ తర్వాత చైతన్య జొన్నలగడ్డ అనే అతన్ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. కానీ నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు తీసి చేతులు కాల్చుకుంది. ఇక చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పూర్తి స్థాయిలో నిర్మాతగా మారి, ‘కమిటీ కుర్రాళ్ళు’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిర్మాతగా నిహారికకు ఈ సినిమా తెచ్చిపెట్టిన లాభాలు మామూలివి కావు, నాగబాబుకి ఈమె సక్సెస్ అవ్వడం పట్ల ఎంత ఆనందం ఉంది ఉంటుందో మీరే ఊహించుకోండి.
అయితే నిహారిక సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. తనకు సంబంధించిన ఫోటోలు,వీడియోలను ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది నిహారిక. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ స్టోరీ లో మైనర్ పాస్ పోర్ట్ అనే హ్యాండిల్ తన గురించి రాసిన ఒక నోట్ ప్యాడ్ ని షేర్ చేస్తూ ‘నేను అతన్ని ప్రేమిస్తున్నాను..అంబటి భార్గవి దయచేసి నువ్వు మా ఇద్దరి స్నేహం మధ్యలోకి రాకు. ఓకే థాంక్స్..బై’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకు ఆ మైనర్ పాస్ పోర్ట్ అకౌంట్ ఎవరిదీ అని ఆరా తీస్తే ఒక చిన్న బాబు అని తెలిసింది. నిహారిక కి మొదటి నుండి చిన్న పిల్లలంటే బాగా ఇష్టం. వాళ్ళతో కలిసినప్పుడల్లా ఈమె కూడా చిన్న పిల్లలాగా మారిపోయి కాసేపు ఈ లోకం మర్చిపోతుండడాన్ని ఎన్నోసార్లు మనం గమనించే ఉంటాము.
ఇదంతా పక్కన పెడితే నిహారిక కొణిదెల రీసెంట్ గానే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర’ (Vishwambhara Movie) మూవీ టైటిల్ సాంగ్ షూటింగ్ లో పాల్గొనింది. ఈ పాటలో ఈమెతో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా కనిపిస్తాడు. తన పెద్దనాన్న తో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతో అదృష్టం అంటూ ఆమె ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ కూడా పెట్టింది. అయితే అభిమానులు మాత్రం అందుకు సంతృప్తి గా లేరు. ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ అవసరమా?, చిరంజీవి ఇక ఎప్పటికి అప్డేట్ అవుతాడు అంటూ పెదవి విరుస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ కి మెగాస్టార్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇది మొదటిసారి. కానీ నిహారిక కొణిదెల గతంలో ‘సై రా నరసింహారెడ్డి’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించింది.