Chennai Love Story: ‘ ‘K ర్యాంప్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కిరణ్ సబ్బవరం హీరోగా నటించిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ , బేబీ నిర్మాత SKN సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రమిది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాకు రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఇదే ఆయనకు తోలిసినిమా. శ్రీ గౌరీ ప్రియా ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని చూడబోతున్నాము అనే ఫీలింగ్ ని కలిగించింది. మేకర్స్ కూడా ప్రొమోషన్స్ చాలా గట్టిగా చేస్తున్నారు. వరుసపెట్టి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. అవి బాగా వైరల్ అయ్యాయి. అయితే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని రామానాయుడు స్టూడియోస్ లోని థియేటర్ లో ప్రదర్శించారట.
మూవీ టీం తో పాటు , ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది ప్రముఖులు, మీడియా ప్రతినిధులు ఈ ప్రివ్యూ షో కి హాజరయ్యారట. వాళ్ళు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. చాలా కాలం తర్వాత ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని చూసాము అనే భావన కలిగిందని , కేవలం యూత్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, కుటుంబ సభ్యులు కూడా ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వచ్చి చూసి ఎంజాయ్ చేసే రేంజ్ లో ఉందని, కచ్చితంగా కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు.ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు , డైలాగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని, మణిశర్మ అందించిన నేపధ్య సంగీతం ఈ చిత్రానికి బ్యాక్ బోన్ అంటూ కొనియాడుతున్నారు.
సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే , క్లైమాక్స్ సన్నివేశం మరో ఎత్తు అని, బరువైన గుండెతో థియేటర్ నుండి బయటకు వస్తామని ,ఆ రేంజ్ ఎమోషన్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంటే దాదాపుగా ట్రాజెడీ రేంజ్ ఎమోషన్ అన్నమాట. దీనిని ఆడియన్స్ రిసీవ్ చేసుకోగలిగితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుందని , ఒకవేళ రిసీవ్ చేసుకోలేకపోతే తేడా ఫలితం రావొచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ ట్రాజెడీ ఎలిమెంట్ ఏమిటి అనేది తెలియాలంటే ఈ నెల 24 వరకు ఆగాల్సిందే. కిరణ్ అబ్బవరం , శ్రీ గౌరీప్రియ నటన వేరే లెవెల్ లో ఉంటుందనే టాక్ కూడా నడుస్తోంది.
