AIC Recruitment 2021: దేశంలోని ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ తాజాగా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. మేనేజ్‌మెంట్ ట్రైనీ, హిందీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 31 ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.
https://www.aicofindia.com/aichindi/pages/default.aspx వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 13వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉందని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జనవరి నెలలో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. మొత్తం 31 ఉద్యోగ ఖాళీలలో 30 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు ఉండగా ఒక హిందీ ఆఫీసర్ పోస్ట్ ఉంది.
Also Read: పశుపాలన్ నిగమ్ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?
aicofindia.com వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్ట్ & డైరెక్ట్ రిక్రూట్ హిందీ ఆఫీసర్ (స్కేల్ i)/ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో దరఖాస్తు ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. బీఎస్సీ అగ్రికల్చర్, బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లు మైనేజ్ మెంట్ ట్రైనీ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.
కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి హిందీ సబ్జెక్టుతో మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్లు హిందీ ఆఫీసర్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Also Read: సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?