అరె.. ఆ నటి తల్లి కాబోతుందట !

‘చారు అసోపా’ అంటే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు గానీ, భారతీయ బుల్లితెర ప్రేక్షకుల మనసును గెలుచుకున్న మంచి నటి ఆమె. ప్రముఖ టీవీ నటిగా ‘చారు అసోపా’ ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మోడల్‌ రాజీవ్‌ సేన్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఐతే ఇప్పుడు ఈ దంపతులు ఈ కరోనా కష్టకాలంలో కొత్త శుభవార్తను మోసుకొచ్చారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, త్వరలోనే తమ జీవితాల్లోకి మరొకరు వచ్చే సమయం ఆసన్నమైనది అని తెగ మురిసిపోతూ చెబుతుంది […]

Written By: admin, Updated On : May 22, 2021 2:36 pm
Follow us on

‘చారు అసోపా’ అంటే పెద్దగా గుర్తు పట్టకపోవచ్చు గానీ, భారతీయ బుల్లితెర ప్రేక్షకుల మనసును గెలుచుకున్న మంచి నటి ఆమె. ప్రముఖ టీవీ నటిగా ‘చారు అసోపా’ ఫుల్ బిజీగా ఉన్న టైంలోనే మోడల్‌ రాజీవ్‌ సేన్‌ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఐతే ఇప్పుడు ఈ దంపతులు ఈ కరోనా కష్టకాలంలో కొత్త శుభవార్తను మోసుకొచ్చారు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, త్వరలోనే తమ జీవితాల్లోకి మరొకరు వచ్చే సమయం ఆసన్నమైనది అని తెగ మురిసిపోతూ చెబుతుంది చారు అసోపా.

తాజాగా సోషల్‌ మీడియా వేదికగా తన బేబీ బంబ్‌ తో ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ ‘చారు అసోపా’ తన ఫాలోవర్స్ తో ఈ విషయాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను నా కుటుంబ సభ్యులు చాలా కాలం నుండి ఈ శుభవార్త కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాం. ఆ క్షణం వచ్చింది. నేను గర్భవతినయ్యానని తెలియగానే నా భర్త రాజీవ్‌ చాలా ఎగ్జైట్ అయ్యాడు’ అంటూ సిగ్గు పడుతూ చెప్పింది.

అలాగే ‘చారు అసోపా’ ఇంకా మాట్లాడుతూ.. ‘నిజంగా మా జీవితాల్లో మధురమైన క్షణాలు ఇవి, మాకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇది. మా దాంపత్య జీవితంలో కొత్త అధ్యాయానికి పునాది పడింది. నా భర్త ఇంత సంతోషంగా ఉండటం నేను గతంలో ఎన్నడూ చూడలేదు. తనను అలానే లైఫ్ లాంగ్ చూడాలని ఉంది. నా కళ్ళల్లో ఎప్పుడు తన పై ఎంతో ప్రేమ కనిపిస్తూ ఉంటుందని అందరు చెబుతూ ఉంటారు.

ఇప్పుడు ఆ ప్రేమను పంచుకునే వ్యక్తి మరొకరు రాబోతున్నారు. నవంబరులో డెలివరీ ఉండే అవకాశం ఉంది’ అంటూ చిరునవ్వులు చిందిస్తూ తనలో తానే సిగ్గు పడుతూ చెప్పింది ‘చారు అసోపా’. ఇంతకీ ఈ ‘చారు అసోపా’ భర్త ‘రాజీవ్‌ సేన్‌’ ఎవరయ్యా అంటే.. మాజీ విశ్వ సుందరి సుస్మితా సేన్‌ తమ్ముడు. ఇక ఈ మాజీ విశ్వ సుందరి కూడా త్వరగా మేనత్త అవ్వడానికి తెగ ఎగ్జైటింగ్‌ గా ఉందట. తన మరదలు తల్లి కాబోతుంది అని తెలియగానే జాగ్రత్తలు చెబుతూ అద్భుతమైన మెసేజ్‌ లు పంపిస్తోందట.