Ram Charan: క్లిన్ కారతో విదేశాలకు చరణ్ దంపతులు… కారణం తెలుసా?

క్లిన్ కార రాకతో మెగా ఫ్యామిలీలో జరిగిన మరో శుభం వరుణ్ తేజ్ వివాహం. నాగబాబు తనయుడు వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ వీరికి ఎంగేజ్మెంట్ జరిగింది.

Written By: Vicky, Updated On : October 18, 2023 4:22 pm

Ram Charan

Follow us on

Ram Charan మెగా ఫ్యామిలీలోకి క్లిన్ కార వచ్చాక అన్నీ శుభశకునాలే. అనేక అరుదైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. క్లిన్ కార గర్భంలో ఉండగా రామ్ చరణ గ్లోబల్ ఫేమ్ అందుకున్నాడు. ఆస్కార్ ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆయన నటించిన పాట నాటు నాటు ఆస్కార్ గెలుచుకుంది. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొల్లగొట్టాడు. పుష్ప చిత్రానికి ఉత్తమ నటుడు అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి టాలీవుడ్ హీరో అయ్యాడు.

క్లిన్ కార రాకతో మెగా ఫ్యామిలీలో జరిగిన మరో శుభం వరుణ్ తేజ్ వివాహం. నాగబాబు తనయుడు వరుణ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వివాహం చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ వీరికి ఎంగేజ్మెంట్ జరిగింది. ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కానున్నారు. నవంబర్ 1న లావణ్య-వరుణ్ ఏడడుగులు వేయనున్నారు. కాగా రామ్ చరణ్ దంపతులు రెండు వారాల ముందే ఇటలీకి పయనమయ్యారు.

రామ్ చరణ్-ఉపాసన తమ కూతురు క్లిన్ కారతో మొదటిసారి విదేశీ యానం చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఈ సెలబ్రిటీ కపుల్ క్లిన్ కారతో కనిపించారు. ఉపాసన క్లిన్ కారను ఎత్తుకుంది. ఇక రామ్ చరణ్ తన పెట్ డాగ్ రైమ్ తో ఉన్నాడు. వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, ఉపాసన లుక్ చాలా స్టైలిష్ గా ఉంది. క్లిన్ కారతో కూడిన ఈ విదేశీ ట్రిప్ రామ్ చరణ్ దంపతులకు చాలా ప్రత్యేకం అని చెప్పాలి.

వరుణ్ తేజ్ పెళ్లి నేపథ్యంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ కి చిన్న గ్యాప్ ఇచ్చాడు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుండి దసరాకు అప్డేట్ ఉంది. ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారట. ఆ మధ్య ‘జరగండి జరగండి…’ అనే సాంగ్ లీక్ అయ్యింది. ఇదే సాంగ్ దసరాకు విడుదల చేస్తున్నారట. థమన్ గేమ్ ఛేంజర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్. దిల్ రాజు తన బ్యానర్లో 50వ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు.