‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ ప్రజెంట్ చేస్తున్న సినిమాల్లో కల్లా బారీ క్రేజ్ ఉన్న సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్’. కాగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ పుకారు వినిపిస్తోంది. మలయాళంలో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులోకి వచ్చే సరికి కొన్ని మార్పులు చేస్తున్నారట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాత్రను పెంచబోతున్నారు.
ఈ పాత్రను పెంచడంతో పాటు రానా చేస్తున్న రెండో పాత్ర ఇంపార్టెన్స్ ను కూడా తగ్గిస్తున్నారని తెలుస్తోంది. ఈ మూవీ డైరక్టర్ సాగర్ చంద్ర ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశారట. అయితే, అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాలో ఉన్న రెండు బలమైన పాత్రలలోని ఆ టెంపోను మాత్రం కచ్చితంగా మెయింటైన్ చేస్తామని, కానీ.. పవర్ స్టార్ రేంజ్ కి తగ్గట్లు మార్పులు చేస్తామని చెప్పుకొచ్చారు.
సినిమాలో ఈ రెండు పాత్రలు మంచివే అని, ఆ పాత్రల్లో ఉన్న ఫీల్ ను, సోల్ ను చెడిపోకుండా నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తున్నారని తెలుస్తోంది. ఏ పాత్ర ఔచిత్యాన్ని తగ్గించకుండా ఈ రీమేక్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ గురించి దర్శకుడు సాగర్ చంద్ర చెబుతూ.. పవన్ కళ్యాణ్ కి నేను వీరాభిమానిని. ఓ అభిమానిగా పవన్ ను ఎలా చూడాలనుకుంటున్నానో అలాగే పవన్ని చూపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.
పైగా తన ఐడియాస్ ను ఈ రీమేక్ లో సహజంగా వచ్చేలా మార్పులు చేశానని చెప్పుకొచ్చాడు. ఇక తను చేసిన మార్పులు పవన్ కల్యాణ్ కు బాగా నచ్చాయని, ప్రేక్షకులకు కూడా తప్పకుండా నచ్చుతాయని నమ్మకంగా చెబుతున్నాడు సాగర్ చంద్ర. అక్టోబర్ నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Changes in pawan kalyan remake
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com