Chandrababu : ప్రస్తుతం దేశంలో మూడు భాషల విధానం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక వంటి ప్రాంతాల్లో జనాలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మాతృ బాషా కనుమరుగయ్యే ప్రమాదం ఉన్న ఈరోజుల్లో, హిందీ భాషని మేము అనుమతించబోమని ఖరాకండిగా చెప్పేసారు. తమిళనాడు లో అయితే బడ్జెట్ సమావేశంలో రూపాయి సింబల్ ని కూడా హిందీ ని తొలగించి తమిళం పెట్టారు. ఇది ఇప్పుడు నేషనల్ వైడ్ గా పెద్ద చర్చకు దారి తీసింది. ఇదంతా పక్కన పెడితే మార్చి 14 న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ని పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పిఠాపురం(Pithapuram) లో అట్టహాసం గా జరిపించాడు. లక్షలాది మంది హాజరైన ఈ సభలో పవన్ కళ్యాణ్ దేశంలో ఉన్న అనేక బర్నింగ్ టాపిక్స్ పై తన గళం వినిపించాడు. అందులో భాగంగా ఆయన భాషల వ్యవహారంపై కూడా స్పందించాడు.
Also Read : మార్చి 15.. చంద్రబాబుకు స్పెషల్.. కారణం అదే!
ఆయన మాట్లాడుతూ ‘భాషలను ద్వేషించడం బాధాకరం. హిందీ ని అంత ద్వేషించేవాళ్ళు, తమిళ సినిమాలను ఎందుకు హిందీ లో డబ్ చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నారు?..మీకు వ్యాపారాల కోసం మాత్రం హిందీ కావాలి, చదువుకోవడానికి మాత్రం వద్దు’ అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా విభిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) కూడా పవన్ కళ్యాణ్ లాగానే వ్యాఖ్యానించాడు. ఆయన మాట్లాడుతూ ‘భాషలపై ద్వేషం తగదు. హిందీ మన జాతీయ భాష. మన మాతృ భాషను నేర్చుకుంటూనే హిందీ భాషను కూడా నేర్చుకోవాలి. కేవలం హిందీ ఒక్కటే కాదు, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు నేర్చుకోవాలి. అప్పుడే మనం ఎక్కడికి వెళ్లినా బ్రతకగలం, ఇప్పుడు నేను ఢిల్లీ కి వెళ్తే అనర్గళంగా హిందీ మాట్లాడే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి అందరికీ రావాలి’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
రెండు రోజుల నుండి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను విమర్శిస్తూ వచ్చిన తెలుగు దేశం పార్టీ అభిమానులు, ఇప్పుడు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయం తో ఏకీభవించడం తో వాళ్లకు నోటి నుండి మాట రాలేదు. ఇక జనసైనికులు అయితే చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను షేర్ చేస్తూ, పాపం ఇప్పుడు తమ్ముళ్ల పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది టీడీపీ సానుకూల విశ్లేషకులు అయితే, తమిళనాడు లో భాష భావాన్ని కేవలం రాజకీయం కోసమే ఉపయోగించుకుంటున్నారు, కానీ మన రాష్ట్రంలో అలాంటిదేమి లేదు, పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆ టాపిక్ లోకి వెళ్లి ట్రోల్ అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో కామెంట్స్ చేయడం తో కూటమి మధ్య చిచ్చు పెట్టాలని చూసిన వారందరికీ చెంపదెబ్బ తగిలినట్టు అయ్యింది.
Also Read : జగన్ పై చంద్రబాబు సంచలన ఆరోపణలు!
Chadrababu Naidu about Language controversy. pic.twitter.com/hIBR4w0t8p
— Chanandler bOnG (@BongChh) March 17, 2025