CM Chandrababu (3)
CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజురోజుకు హాట్ టాపిక్ అవుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరుపై కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో ఇరుపక్షాల మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది. తాజాగా శాసనసభలో సీఎం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వైఖరి పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళా సాధికారిత అంశంపై మాట్లాడుతూ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలపై జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరుపై.. సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Also Read: వైయస్సార్ కాంగ్రెస్ ఇన్చార్జిలకు జీతాలు.. నిజం ఎంత?
* మహిళలకు ఆస్తిలో వాటా
కుటుంబ ఆస్తిలో( family assets ) మహిళలకు కూడా వాటాలు దక్కాలి అన్నది తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఈ విషయంలో ఎన్టీఆర్ ప్రత్యేక చట్టం కూడా చేశారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా నందమూరి తారక రామారావు ది. అదే పరంపర కొనసాగిస్తూ చంద్రబాబు సైతం మహిళల కు పెద్దపీట వేస్తూ వచ్చారు. స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన ఘనత తెలుగు నాట చంద్రబాబుదే. మహిళలకు స్వయం ఉపాధి సాధనే ధ్యేయంగా మహిళా సంఘాలను ఏర్పాటు చేశారు సీఎం చంద్రబాబు. ఇప్పుడు తాజాగా అదే విషయాన్ని ప్రస్తావించారు.
* విజయమ్మను పక్కన పెట్టిన జగన్
ప్రస్తుతం వైయస్ విజయమ్మను( y s Vijayamma ) కుమారుడు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. కుమార్తె షర్మిలకు అండగా విజయమ్మ నిలుస్తున్న సంగతి తెలిసిందే. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తిగా వచ్చిన సరస్వతి పవర్ భూముల వ్యవహారంలో అనేక వివాదాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి తీరుపై తల్లి విజయమ్మ ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే తన సోదరి షర్మిల ట్రాప్ లో పడి విజయమ్మ తనపై కేసు వేయడాన్ని తేలిగ్గా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తనకు వ్యతిరేకంగా తన తల్లి విజయమ్మ లేదని.. కేవలం తన సోదరి షర్మిల స్వార్థం వల్లే విజయమ్మ తనకు వ్యతిరేకంగా మారిన విషయాన్ని బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇదే విషయం పై మాట్లాడారు సీఎం చంద్రబాబు. శాసనసభ వేదికగా మహిళా సాధికారతపై చర్చకు వచ్చిన క్రమంలో.. తల్లికి, చెల్లెలికి న్యాయం చేయని వాడు.. రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. ప్రస్తుతం శాసనసభలో సీఎం చంద్రబాబు చేసిన ప్రసంగం వైరల్ అవుతోంది