Guess Photo
Guess Photo: ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ బాల నటుడు కూడా తండ్రి అడుగుజాడల్లోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బాల నటుడిగా ఉన్నప్పుడే ఈ పిల్లోడు జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగా కూడా వరుసగా సినిమాలు చేస్తూ విజయాలు అందుకున్నాడు. తన నటన మరియు సేవా కార్యక్రమాలతో కోట్లాదిమంది అభిమానుల మనసులో స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ ఫోటోలో యాక్షన్ కింగ్ హీరో అర్జున్ చేతిలో ఉన్న పిల్లోడిని మీరు గుర్తుపట్టగలరా. అతను రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా హీరోగా చాలామంది మనసులో స్థానం సంపాదించుకున్నాడు. దిగ్గజా నటుడైన తండ్రి అడుగుజాడల్లోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. చిన్నప్పుడే తన నటన ప్రతిభకు ఉత్తమ బాల నటుడిగా జాతీయ పురస్కారం కూడా సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగా కూడా మారి వరుసగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకున్నాడు. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సినిమాలలో హీరో గానే కాకుండా ఒక సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా కూడా తన టాలెంట్ నిరూపించుకున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే తన సేవా కార్యక్రమాలతో సాధారణ జనాలకు కూడా అభిమాన హీరోగా మారిపోయాడు. ఈ హీరో అనాధల కోసం అనాధశ్రమాలు అలాగే విద్యార్థుల కోసం పాఠశాలలు వసతి గృహాలు, వృద్ధాశ్రమాలు, గోశాలలో ఇలా అందరి బాగును దృష్టిలో పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టాడు. కానీ ఈ నటుడిని కాలం చిన్న చూపు చూసింది. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్న ఇతనిని కాలం తనలో కలిపేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో రారాజుగా రాణించాల్సిన అతను 46 ఏళ్ల చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి 2 ఏళ్ల జైలు శిక్ష..? కారణం ఏమిటంటే!
ఈ స్టార్ హీరో దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్. మార్చి 17 సోమవారం రోజు పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు. పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా అతని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు అలాగే నెటిజెన్స్ ఈ దివంగత నటుడిని గుర్తు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా తమ అభిమాన హీరోకు అభిమానులు అన్నదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ 2002లో రిలీజ్ అయిన అప్పు సినిమాతో హీరోగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఆయన తన 45 ఏళ్ల సినిమా జీవితంలో 32 సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే పునీత్ రాజకుమార్ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి 1800 మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించాడు. అలాగే ఆయన 26 అనాధాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు అలాగే 19 గోశాలలు ఏర్పాటు చేశాడు. అయితే నాలుగేళ్ల క్రితం పునీత్ రాజకుమార్ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ తన అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు.
A star who never fades, a legend who lives on! ✨ Puneeth Rajkumar wasn’t just an actor; he was an emotion, a source of inspiration, and a true gentleman. Happy Birthday, Appu! You will always be our Power Star! ⭐ #HappyBirthdayPuneethRajkumar #PowerStarForever #AppuLivesOn pic.twitter.com/5SqnDxryhB
— Shri Ratna Film Company (@Shriratnafilmco) March 17, 2025