OG Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటి అంటే వాళ్ళు మాత్రమే పెద్ద బడ్జెట్ తో సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ముఖ్యంగా ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చాలి అంటే దర్శకుడు ఆ కథను తెర మీద చాలా అద్భుతంగా ఆవిష్కరించాల్సిన అవసరమైతే ఉంది. అలాంటి సినిమాలు చేసినప్పుడు మాత్రమే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోకి సక్సెసు లైతే దక్కుతాయి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.
ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన ఓజీ సినిమాతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ చాలామంది కామెంట్లు చేస్తూ ఉండటం విశేషం…ఇక ఎప్పుడు కన్నడ సినిమా దర్శకుడు అయిన చంద్ర రీసెంట్ గా ఓహో సినిమా దర్శకుడు అయిన సుజీత్ మీద సంచలన వ్యాఖ్యలు చేశాడు.
అవేంటి అంటే తను ఉపేంద్ర తో చేసిన ‘కబ్జా’ సినిమాలో ఎలాంటి ఎలివేషన్స్ షాట్స్ వాడాడో వాటిని ఓజీ సినిమా కోసం సుజిత్ రీ క్రియేట్ చేశాడని చెప్పాడు. చాలావరకు తన షాట్స్ అందులో వాడుకున్నారని అనడంతో ఇది చూసిన నెటిజన్లు చంద్ర మీద ఫైర్ అవుతున్నారు. ఆయన మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ‘నువ్వే కెజిఎఫ్ నుంచి షార్ట్స్ లేపేసి సినిమా చేసావు.
మళ్ళీ నీ సినిమాలో నుంచి సుజిత్ కాపీ చేశాడు అంటున్నావ్. అయిన సుజీత్ కి నీ సినిమా నుంచి కాపీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది’ అంటూ అతని మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు… ఇక ఈ విషయం మీద ఓజీ సినిమా దర్శకుడు అయిన సుజిత్ మాత్రం ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు…. ప్రస్తుతం సుజిత్ నానితో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ‘ఓజీ 2’ సినిమాని స్టార్ట్ చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది…