Maganti Sunitha Nomination: తెలంగాణలో నవంబర్ 11న జరుగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు 180 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అక్టోబర్ 21న నామినేషన్ల దాఖలు గడువు ముగియగా 22న పరిశీలన చేపట్టారు. ఇందులో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ చుట్టూ మరోసారి చర్చ మొదలైంది. ఆమె అభ్యర్థిత్వం చట్టపరంగా సరైందో కాదో అనే అంశంపై ఎన్నికల సంఘానికి లేఖలు అందాయి. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణ నేపథ్యంలో ఈసీ తదుపరి నిర్ణయం రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
బీఆర్‌ఎస్ ముందే ఊహించిందా..?
మాగంటి గోపీనాథ్ మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో దానిని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ క్రమంలో గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చింది. అయితే ఆమె అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు వస్తాయని బీఆర్‌ఎస్ ముందే ఊహించినట్లు తెలుస్తోంది. అందుకే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్‌రెడ్డితో మరో నామినేషన్ వేయించినట్లు సమాచారం. పార్టీలోని కొందరు సునీత అభ్యర్థిత్వంపై అభ్యంతరాలు రావొచ్చని అధిష్టానానికి సమాచారం ఇచ్చారని తెలిసింది. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా విష్ణువర్ధన్‌తో నామినేషన్ వేయించినట్లు ప్రచారం జరుగుతోంది.
సునీత బరిలో ఉంటుందా?
సునీతపై వచ్చిన పిటిషన్‌ను ఎన్నికల కమిషన్ సమీక్షిస్తుందనీ, చట్టపరంగా నామినేషన్ అర్హత ప్రశ్నార్థకంగా మారితే పోటీ కొనసాగించడం కష్టం అవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు. అయినా, అధికారిక రద్దు ఆదేశాలు రాకపోవడంతో ఆమె మద్దతుదారులు ఇంకా ఆశ కోల్పోలేదు.
తాజా పరిణామాలతో బీఆర్‌ఎస్ శిబిరంలో వ్యూహాత్మక కదలికలు గమనించవచ్చు. సునీత అనర్హత తేలితే, విష్ణువర్ధన్‌రెడ్డి ప్రత్యామ్నాయ అభ్యర్థిగా రంగంలోకి వస్తారని అంచనా. ఈ క్రమంలో ప్రతిపక్షాలు కూడా ప్రచార దిశను మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఈసీ నుంచి అధికారిక నిర్ణయం వెలువడేంతవరకు రాజకీయ అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది.
మాగంటి సునీత నామినేషన్ విషయంలో కొత్త ట్విస్ట్.. తెరమీదకు కొత్త వ్యక్తి !
ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం సునీతపై చర్యలు తీసుకోవాలని ఈసీకి లేఖ
సునీత అభ్యర్థిత్వంపై వేటు పడుతుందని విష్ణువర్ధన్ రెడ్డితో బీఆర్‌ఎస్ నామినేషన్ వేయించిందా ?#JubileeHillsByElection #MagantiSunitha pic.twitter.com/ofG7he5JyR
— Telugu360 (@Telugu360) October 22, 2025