https://oktelugu.com/

మళ్లీ జబర్ధస్త్‌లోకి రావడంపై స్పందించిన చమ్మక్ చంద్ర !

జబర్ధస్త్ కమెడియన్లలో చమ్మక్ చంద్ర శైలి వేరు. ఫ్యామిలీల ఫై పంచ్ లు వేస్తూ.. బూతులో నీతులు చెబుతూ మొత్తానికి మంచి క్రేజ్ ను సంపాదించాడు. అయితే జబర్ధస్త్‌ కు గుడ్ బై చెప్పి అదిరింది షోకు వెళ్లిన చంద్ర.. అక్కడ కూడా తన మార్క్ చూపించలేక పూర్తిగా తేలిపోయాడు. ప్రస్తుతం అదిరింది షో ఆగిపోవడంతో చంద్ర పరిస్థితి ఏమిటి ? మళ్లీ అతను జబర్ధస్త్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందా ? లేదా ? అని […]

Written By:
  • admin
  • , Updated On : February 4, 2021 / 01:29 PM IST
    Follow us on


    జబర్ధస్త్ కమెడియన్లలో చమ్మక్ చంద్ర శైలి వేరు. ఫ్యామిలీల ఫై పంచ్ లు వేస్తూ.. బూతులో నీతులు చెబుతూ మొత్తానికి మంచి క్రేజ్ ను సంపాదించాడు. అయితే జబర్ధస్త్‌ కు గుడ్ బై చెప్పి అదిరింది షోకు వెళ్లిన చంద్ర.. అక్కడ కూడా తన మార్క్ చూపించలేక పూర్తిగా తేలిపోయాడు. ప్రస్తుతం అదిరింది షో ఆగిపోవడంతో చంద్ర పరిస్థితి ఏమిటి ? మళ్లీ అతను జబర్ధస్త్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉందా ? లేదా ? అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన భవిష్యత్తు పై చంద్ర కీలక నిర్ణయం తీసుకున్నాడట.

    Also Read: ప్రభాస్ ఎలా మ్యానేజ్ చేస్తాడో.. అది గొప్పే !

    కాగా రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ‌పై చంద్ర క్లారిటీ ఇస్తూ.. నేను మళ్లీ జబర్ధస్త్‌కు వస్తున్నానని వార్తలు వస్తున్నాయి. అయితే నేను జబర్దస్త్ వచ్చే దానికన్నా, అదే విధంగా అదిరింది షోలో కొనసాగడం కన్నా.. తన టార్గెట్ వేరే ఉందని చంద్ర స్పష్టం చేశాడు. తనకు సినిమాలపై ఫోకస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉందని.. అందుకే బుల్లితెరపై ఎక్కువగా ఫోకస్ చేయడం లేదని చంద్ర చెప్పుకొచ్చాడు.

    Also Read: మెగాస్టార్ దెబ్బకు దివి రేంజ్ మారింది !

    అందుకే మళ్లీ జబర్ధస్త్‌ పై ఇక కనిపించను అని చంద్ర చెబుతున్నాడు. నిజానికి జబర్ధస్త్‌ చేస్తున్న సమయంలోనే చంద్ర అనేక సినిమాల్లో నటించినా.. చంద్రకు గొప్ప బ్రేక్ ఏమి రాలేదు. ఓ వైపు సినిమాలు, మరోవైపు షోలలో నటిస్తూ బిజీగా కొనసాగుతున్నా.. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్ల సినిమాల్లో కనిపిస్తూ వెండితెరపై తన ప్రాధాన్యత పెంచుకోవడానికి ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నా.. చంద్ర అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. కాగా తాజాగా జబర్ధస్త్‌, అదిరింది వంటి షోలల్లో లేకపోవడంతో.. చమ్మక్ చంద్ర పూర్తిస్థాయిలో సినిమాలపై ఫోకస్ చేసే ఛాన్స్ వచ్చింది. మరి.. చూడాలి చంద్ర ఈ సారి సినిమాల్లో బ్రేక్ సాధిస్తాడేమో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్