Homeఎంటర్టైన్మెంట్Chandamama Movie Heroine: చందమామ మూవీ హీరోయిన్ కి ఇంత పెద్ద కూతురు ఉందా? ఎలా...

Chandamama Movie Heroine: చందమామ మూవీ హీరోయిన్ కి ఇంత పెద్ద కూతురు ఉందా? ఎలా ఉందో చూశారా?

Chandamama Movie Heroine: కన్నడ భామ సింధు మీనన్ కి తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఫేమ్ ఉంది. ఆమె పలు భాషల్లో హీరోయిన్ గా చిత్రాలు చేసింది. పెళ్లి తర్వాత సిల్వర్ స్క్రీన్ కి దూరమైన సింధు మీనన్ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఆమె ఫ్యామిలీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక సింధు మీనన్ కూతురు ఫోటోలు చూసిన జనాలు… ఇంత పెద్ద కూతురు ఉందా? అని వాపోతున్నారు.

సింధు మీనన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిశ్రమలో అడుగుపెట్టింది. తెలుగులో సింధు మీనన్ మొదటి తెలుగు చిత్రం భద్రాచలం. శ్రీహరి హీరోగా 2001లో విడుదలైన భద్రాచలం సూపర్ హిట్ కొట్టింది. సింధు మీనన్ కి తమిళ చిత్రం యీరం ఫేమ్ తెచ్చింది. తెలుగులో వైశాలి గా విడుదలైంది. తెలుగులో కూడా వైశాలి మంచి విజయం సాధించింది. చందమామ మూవీతో సింధు మీనన్ కి పాపులారిటీ మరింత పెరిగింది. దర్శకుడు కృష్ణ వంశీ తెరకెక్కించిన చందమామ హిట్ టాక్ తెచ్చుకుంది.

కాజల్ ప్రధాన హీరోయిన్ గా చందమామ తెరకెక్కింది. సింధు మీనన్ సెకండ్ హీరోయిన్ గా చేసింది. శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా నటించారు. సింధు మీనన్ నటించిన చివరి తెలుగు చిత్రం సిద్ధం. జగపతిబాబు హీరోగా ఈ చిత్రంలో నటించారు. అనంతరం ఆమె రెండు మూడు మలయాళ చిత్రాలతో పాటు ఒక తమిళ చిత్రం చేసింది.

ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న సింధు మీనన్ 2010లో తమిళనాడుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ ప్రభు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు సంతానం. మొదటి సంతానంగా అమ్మాయి పుట్టింది. తర్వాత ఇద్దరు అబ్బాయిలకు ఆమె జన్మనిచ్చారు. సింధు మీనన్ తన ఇద్దరు కొడుకులతో పాటు కూతురితో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. సదరు ఫోటోలో సింధు మీనన్ కూతురిని చూసి ఫ్యాన్స్ అవాక్కు అవుతున్నారు. సింధు మీనన్ కి ఇంత పెద్ద కూతురు ఉందా అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular