Champion Movie Trailer: సినిమా ఇండస్ట్రీ, కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది… ప్రస్తుతం ఉన్న హీరోలందరు మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక అందులో భాగంగానే డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు… ఇక ఇప్పుడు స్వప్న దత్ ప్రొడ్యూసర్ గా ప్రదీప్ అద్వైతం దర్శకుడిగా చేస్తున్న సినిమా ‘ఛాంపియన్’… స్వాతంత్ర్యానికి ముందు హైదరాబాద్ లో ఎలాంటి పరిస్థితులు ఉండేవి. రజాకార్ల సామ్రాజ్యంలో ఇక్కడి ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈనెల 25వ తేదీన రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది… ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలని చూస్తున్న శ్రీకాంత్ కొడుకు రోషన్ ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా నుంచి గత కొద్ది గంటల క్రితం ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో ఒక ఊరిలో ఉన్న ఒక వ్యక్తి తన ప్రేమ కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఫుట్ బాల్ ఆడాల్సిన పరిస్థితి వస్తోంది. అందులో భాగంగానే అప్పుడున్న నిజాం సామ్రాజ్యాన్ని ఆ హీరో ఎలా ఎదుర్కొన్నాడు. అతనికి ఆ ప్రభుత్వం ఎలాంటి శిక్షణ విధించింది. తన ప్రేమను సక్సెస్ ఫుల్ గా నిలబెట్టుకున్నాడా లేదా అనే కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది…
‘రోషన్ మేక’ ఇప్పటివరకు ఒకటి రెండు సినిమాలను చేసినప్పటికి అవి ఆశించినా మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు ఈ సినిమా మీదనే ప్రేక్షకుల అంచనాలున్నాయి. ఇక వాటికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలుగుతోందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అయితే ఈ సినిమా కథ ఓకే అనిపించినప్పటికి రోషన్ కి మాత్రం ఇది పెద్ద హెవీ వెయిట్ ఉన్న కథగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలను చిన్నచిన్న కథలతో చేశాడు. ఒకేసారి ఇంత పెద్ద కాన్సెప్ట్ తో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవకాశమౌతే ఉంది.
ఇక అది ఏమాత్రం తేడా కొట్టిన కూడా సినిమా టాక్ విషయంలో నెగెటివ్ కామెంట్స్ ని ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా పకడ్బందీ ప్రణాళికతో రిలీజ్ చేసి అదే రేంజ్ లో ప్రమోషన్స్ ని చేస్తే సక్సెస్ ఫుల్ గా నిలుస్తోంది. లేకపోతే మాత్రం చాలా వరకు డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…