
Chalaki Chanti : చలాకి చంటి.. పరిచయం అక్కరలేని పేరు. జబర్దస్త్ కామడిషో ద్వారా వెలుగులోకి వచ్చిన చాలా మంది కమెడియన్లలో చంటి ఒకరు. రియాలిటీ షోలతోపాటు సినిమాల్లో కూడా చంటి నటించాడు. చంటి ఆదివారం గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. ఈమేరకు సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అవుతోంది. సీరియస్ కండిషన్‌లో ఉన్న చంటికి ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నట్లు చెబుతున్నారు.
జబర్దస్త్‌తో క్రేజ్..
జబర్దస్త్ షో ద్వారా అనేకమంది కమెడియన్లు మంచి క్రేజ్ తెచ్చుకోవడమే కాదు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకున్నారు. అలా జబర్దస్త్ ద్వారా కమెడియన్‌గా మారి అనేక సినిమాల్లో కూడా నటించారు చలాకి చంటి. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఏకంగా టీం లీడర్ కూడా అయిన చంటి తర్వాతి కాలంలో బిగ్ బాస్ అవకాశం రావడంతో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు.
బిగ్‌బాస్ హౌస్‌లో కొన్ని రోజులే..
బిగ్‌బాస్‌లో పాల్గొనే చాన్స్ రావడంతో చంటి సంతోషం వ్యక్తం చేశాడు. అయితే హౌస్ లోకి వెళ్లిన చంటి ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నా తర్వాత బయటకు వచ్చేశాడు. అప్పటి నుంచి అడపా దడపా సినిమాల్లో కనిపిస్తున్నాడు. ఎక్కువగా షోస్‌లలో మాత్రం కనిపించడం లేదు. అయితే అనూహ్యంగా చలాకి చంటికి గుండెపోటు వచ్చిందని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఇది ఎవరూ నమ్మలేదు కానీ ఆయన సన్నిహితవర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అది నిజమేనని అంటున్నారు.
కండీషన్ సీరియస్..
ప్రస్తుతం చంటి కండీషన్ సీరియస్‌గా ఉన్నట్లు అతని సన్నిహితులు చెబుతున్నారు. ఆయనను హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో కుటుంబ సభ్యులు చేర్చారని తెలుస్తోంది. హాస్పిటల్‌లో చేర్చిన సమయంలో చలాకీ చంటి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత సోమవారం అంటే రేపు గాని లేదా మంగళవారం కానీ డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అభిమానుల్లో కలవరం..
నిజానికి ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ద్యంలో చలాకీ చంటికి కూడా గుండెపోటు వచ్చిందని వార్త విని ఆయన అభిమానులు కలవర పడుతున్నారు. అయితే ఆయన పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని తెలియడంతో వారంతా కుదుటపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కేవలం చలాకీ చంటి సన్నిహితులు చెబుతున్న ఆఫ్ ది రికార్డ్ సమాచారం మాత్రమే బయటకు వస్తోంది. ఆయన కోలుకుంటే కానీ ఆయన తన ఆరోగ్యం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.