Nithya Shetty : సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది ఆ తరువాత హీరోయిన్లుగా సక్సెస్ అయ్యారు. కానీ కొందరు మాత్రం ఒకటి, రెండు సినిమాల్లో హీరోయిన్ గా కనిపించి ఆ తరువాత కనుమరుగయ్యారు. అయితే కొందరు ఫేమస్ కావడానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు వీడియోలను షేర్ చేస్తున్నారు. ఇప్పటికప్పుడు తమ లేటేస్ట్ పిక్స్ అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పలు చిత్రాలలో బాల నటిగా అలరించిన ఓ ముద్దుగుమ్మ పెరిగి పెద్దయ్యాక హీరోయిన్ గా అడుగుపెట్టింది. మొదట్లో ఆమెకు గుర్తింపు రాకపోయినా.. ఈమె ఫలానా బాలనటి అని చెప్పడంతో ఆమె సినిమాలను ఆదరించారు.
అయితే ఈ భామ ఇటీవల షేర్ చేసిన ఓ వీడియో వివాదాస్పందంగా మారింది. అంతేకాకుండా నిన్ను ఆదరిస్తే నువ్వు ఇలాంటి వీడియోలు చేస్తావా? అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమె చేసిన వీడియోపైనే చర్చ సాగుతోంది. అయితే ఇంతలో ఈ క్యూట్ భామ తనకు సంబంధించిన ఓ ఫొటో పిక్ పెట్టి ఎవరో చెప్పుకోండి అని షేర్ చేసింది. కొందరు ఈమె అందంపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె షేర్ చేసిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు?
దేవుళ్లు సినిమా ఇద్దరు చిన్నారుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో అమ్మాయి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈమె పెరిగి పెద్దయి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నిత్యా శెట్టి. ఇటీవల సోషల్ మీడియాలో నిత్యాశెట్టి గురించి పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ‘నువ్వు తోపురా’ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన నిత్యా శెట్టికి పెద్దగాగుర్తింపు రాలేదు. కానీ ‘పిట్టకథ’ అనే సినిమా ద్వారా పాపులారిటీ సాధించింది. దీంతో ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగాయి.
అయితే ఇటీవల బాత్ టబ్లో మందు తాగుతున్న వీడియో ఒకటి షేర్ చేసింది. ఇంతకాలం అమె అందానికి ఫిదా అయిన నెటిజన్లు ఒక్కసారిగా ఇలా చేసేసరికా అంతా షాక్ తిన్నారు. దీంతో ఆమెపై వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే అవకాశాల కోసం ఇంతకు దిగజారాలా? అని మెసేజ్ లు పెట్టారు. ఇదిలా ఉండగా అందంతో కవ్వింపజేసే వీడియోలూ షేర్ చేసింది. ఇందులో ఆమెను చూసి యూత్ ఆకర్షితులవుతున్నారు.