Rebel Star Prabhas: ప్రభాస్ మంచి తనమే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలందుకునేలా చేసింది. ప్రభాస్ వ్యక్తిత్వమే అతన్ని పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ప్రభాస్ కెరీర్‌లో విజయవంతమైన చిత్రాలున్నా.. అలాగే భారీ ఫ్లాపులు కూడా ఉన్నాయి. కానీ.. ఇది ప్లాప్ అవుతుంది అని తెలిసి కూడా ప్రభాస్ ఆ సినిమా చేయడం కచ్చితంగా గొప్ప విషయం. ఈ కథ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుంది అని తెలిసి తెలిసి.. తన కెరీర్ ను ప్రభాస్ రిస్క్ లో పెట్టిన విధానం ప్రభాస్ మంచితనానికి నిదర్శనం.

కృష్ణవంశీ దర్శకత్వంలో 2005 మార్చి 25న విడుదలైన సినిమా చక్రం. ప్రభాస్ కి ఈ కథ నచ్చింది. కృష్ణవంశీకి సినిమా చేస్తా అని మాట ఇచ్చాడు. కథలో హీరో చనిపోతాడు అని తెలుసు. అసలు తెలుగు సినిమాల్లో హీరో చనిపోతే ఎవ్వరూ చూడరు. పైగా ఒక స్టార్ హీరో చనిపోతే ప్రేక్షకులు జీర్ణయించుకోలేరు. అందుకే ప్రభాస్ ను ఈ సినిమా చేయవద్దని చాలామంది రిక్వెస్ట్ చేశారు.
Also Read: ANR vs NTR and Jr NTR vs Ramcharan: అప్పుడు ఎన్టీఆర్ – ఏఎన్నార్… ఇప్పుడు చరణ్ – జూ. ఎన్టీఆర్
ఓ దశలో కృష్ణవంశీ కూడా మనం వేరే కథ చేద్దాం, ఈ కథ పక్కన పెడదాం అన్నారట. కృష్ణవంశీ ఈ మాట అనడానికి కారణం.. అప్పటికే ఈ కథను మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, చివరకు హీరో గోపీచంద్ కూడా రిజెక్ట్ చేశాడు. వాళ్ళంతా చెప్పింది ఒకే మాట. ఇది తెలుగు సినిమాకి సెట్ కాదు అని. కాబట్టి.. మేము ఈ సినిమా చేయడానికి సాహసం చేయలేము అని.
కృష్ణవంశీకి మెగాస్టార్, మహేష్ ల మాటలు గుర్తుకు వచ్చాయి. అయోమయంలో పడిపోయాడు కృష్ణవంశీ. అసలుకే మొహమాటానికి పోయి ప్రభాస్ ఈ సినిమా టేకప్ చేశాడు. వదిలేసే అవకాశం వచ్చింది. మరో హీరో అయితే.. వదిలేసే వాడే. కానీ అక్కడ ఉంది ప్రభాస్ కదా. ప్లాప్ అయితే ఏమిటి ? మంచి కథ, కాబట్టి చేద్దాం అని కృష్ణవంశీకి ధైర్యం చెప్పి.. ఆ సినిమా చేసి పెద్ద ప్లాప్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

అయినా, ప్రభాస్ బాధ పడలేదు. కథను మాత్రమే నమ్మాడు. ప్రభాస్ కథను అంత గొప్పగా నమ్ముతాడు కాబట్టే.. ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా తెలుగోడి సత్తా చూపించి ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు చేస్తోన్న ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘స్పిరిట్’లు అన్నీ పాన్ ఇండియా సినిమాలే. ప్రభాస్ ఇలాగే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటూ వెళ్లాలని ఆశిద్దాం.
Also Read:Rajinikanth Basha movie: రజినీకాంత్ లైఫ్ ను మార్చేసిన బాషా మూవీ వెనక జరిగిన పరిణామాలు తెలుసా..?
[…] Liger Movie: టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. ఆయన మార్కెట్ పెరగడంతో భారీ ప్రాజెక్టులు చేస్తున్నారు. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన చాలా తక్కువ టైమ్ లోనే అభిమాన సంఘాలు ఏర్పడేంత పెద్ద స్టార్ గా అవతరించాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొద్దిమంది స్టార్ హీరోల లిస్టులో ఆయన కూడా ఉన్నారు. […]