https://oktelugu.com/

Prabhas: చిరంజీవి ‘ఛీ’ కొట్టిన కథతో ప్రభాస్ సినిమా.. చివరికి ఏమైందంటే!

కృష్ణవంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 వ తారీఖు 2005 వ సంవత్సరం లో విడుదల అయ్యింది. అప్పటికీ ప్రభాస్ కెరీర్ ప్రారంభమై కేవలం ఒకే ఒక్క హిట్ మాత్రమే ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : May 25, 2023 / 02:24 PM IST

    Prabhas

    Follow us on

    Prabhas: కొన్ని సినిమాలు ఫలితం తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరి మనసుకి ఎంతో హత్తుకు పోయే విధంగా ఉంటాయి.ముఖ్యంగా మన స్టార్ హీరోల ఫిల్మోగ్రఫీ లో అట్టర్ ఫ్లాప్స్ గా నిల్చిన కొన్ని చిత్రాలు లాంగ్ టర్మ్ లో క్లాసిక్స్ గా మిగిలిపోతాయి. అలా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో ఒక మంచి చిత్రం గా మిగిలిపోయింది ‘చక్రం’.

    కృష్ణవంశీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 వ తారీఖు 2005 వ సంవత్సరం లో విడుదల అయ్యింది. అప్పటికీ ప్రభాస్ కెరీర్ ప్రారంభమై కేవలం ఒకే ఒక్క హిట్ మాత్రమే ఉంది. ఆ చిత్రం పేరే వర్షం, ఆ తర్వాత ఆయన చేసిన అడవి రాముడు చిత్రం కమర్షియల్ ఫ్లాప్ గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ 5 వ చిత్రం గా ‘చక్రం’ విడుదలైంది.

    విడుదలకు ముందు సూపర్ హిట్ సాంగ్స్ తో మంచి క్రేజ్ ని దక్కించుకున్న ఈ సినిమా విడుదల తర్వాత డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని కమర్షియల్ గా కూడా ప్రభాస్ కెరీర్ లో భారీ ఫ్లాప్ గా మిగిలింది. అయితే ఈ సినిమాని కృష్ణ వంశీ తొలుత ప్రభాస్ తో చెయ్యాలని అనుకోలేదట, మెగాస్టార్ చిరంజీవి తో చేద్దాం అనుకున్నాడట. కానీ చిరంజీవి క్లైమాక్స్ లో చనిపోయినట్టు చూపిస్తే జనాలు చూడరు, ఇలాంటి సబ్జెక్టు తో నా దగ్గరకి ఎలా రావాలి అనిపించింది అంటూ మెగాస్టార్ నో చెప్పాడట.

    ఇక ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కి కూడా చెప్పాడట, ఆయన కూడా ఇంచుమించు ఇదే కారణం చెప్పి ఈ సినిమా నుండి తప్పించుకున్నాడు. చివరికి ప్రభాస్ వద్దకు ఈ కథ చేరింది, ఆయన ఛాలెంజ్ గా తీసుకొని ఈ చిత్రం చేసాడు, ఫలితం తారుమారు అయినా, ప్రభాస్ కెరీర్ లో ఒక చక్కటి చిత్రం గా మాత్రం మిగిలిపోయింది.