అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ప్రయోగాలు బాగా ఇష్టం. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ప్రయోగాలతోనే హీరోగా ఎదిగారు. ప్రవాహం లాంటి ఎన్టీఆర్ స్టార్ డమ్ లో కూడా హీరోగా నిలబడగలిగారు. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున కూడా ఎన్నో ప్రయోగాలు చేసాడు. తన కెరీర్ స్టార్టింగ్ లో కొత్త కొత్త డైరక్టర్లతో సినిమాలు చేసి కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన ఘనత కూడా నాగ్ కే దక్కుతుంది.
అయితే, అలాంటి ప్రయోగాల ఫ్యామిలీ నుండి వచ్చిన నాగచైతన్య మాత్రం ప్రయోగాలకు పూర్తిగా దూరం అయిపోతున్నాడు. కెరీర్ మొదటి నుండి చైతు సేఫ్ గేమే ఆడుతున్నాడు. అయితే, ఇద్దరు ముగ్గురు కొత్త డైరక్టర్లకు చైతు అవకాశం ఇచ్చాడు. కానీ ఇచ్చిన ప్రతిసారి ఫ్లాపులు, యావరేజ్ లు చూసి చూసి విసిగి వేసారి పోయాడు. ఇక కొత్తవాళ్లతో సినిమా చేయకూడదు, చేస్తే కెరీర్ నాశనం అయిపోతుందని గట్టిగా డిసైడ్ అయిపోయి, తమ ఫ్యామిలీ ఆనవాయితీని వదిలేశాడు.
అందుకే, ఓ కొత్త డైరెక్టర్ పైగా తన స్నేహితుడు కూడా. జోష్ సినిమా నుండి తనతోనే ట్రావెల్ అవుతున్నాడు. పైగా పర్సనల్ లైఫ్ లో కూడా చైతుతో చాల సన్నిహితంగా ఉన్నాడు అతను. చైతు సినిమా ఇస్తాడు అని ఇన్నాళ్లు ఎదురుచూశాడు. కానీ, ఛాన్స్ ఇచ్చేలా లేడు. అందుకే నిర్మాత పీవీపీ నిర్మాణంలో తానూ డైరెక్టర్ అంటూ చైతు ముందు ఒక ప్రపోజల్ పెట్టాడు ఆ డైరెక్టర్.
పీవీపీ కూడా చైతును ఒప్పించడానికి గట్టిగానే ప్రయత్నం చేశాడు. కానీ కొత్త డైరక్టర్ తో సినిమా చేసేది లేదు, అది నా స్నేహితుడు అయినా సరే. దయచేసి ఈ సినిమా గురించి నన్ను ఇక ఏమి అడగొద్దు అంటూ చైతన్య క్లారిటీగా నిర్మాతకు చెప్పేసిన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కథ బాగున్నా, కరెక్ట్ గా హ్యాండిల్ చేయగల అనుభవం వున్న డైరెక్టర్ తోనే సినిమా చేయాలని చైతు ఫీల్ అవుతున్నాడు. ప్రస్తుతం దిల్ రాజకు థాంక్యూ చేస్తున్నారు. అమీర్ ఖాన్ హిందీ సినిమా కూడా చేస్తున్నాడు.