సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు – సాయి పల్లవికలయికలో రానున్న ‘లవ్ స్టోరీ’ మొత్తానికి షూటింగ్ ను మొదలు పెట్టేసింది. ఇప్పటికే 80 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు నుండి స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం షూటింగ్ గురించి అధికారిక ప్రకటన చేస్తూ.. ‘ ప్రభుత్వం చెప్పినట్లుగానే అన్ని నియమనిబంధనలకు అనుగుణంగానే షూట్ చేస్తున్నామని, పైగా కేవలం […]
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతు – సాయి పల్లవికలయికలో రానున్న ‘లవ్ స్టోరీ’ మొత్తానికి షూటింగ్ ను మొదలు పెట్టేసింది. ఇప్పటికే 80 % షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజు నుండి స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందం షూటింగ్ గురించి అధికారిక ప్రకటన చేస్తూ.. ‘ ప్రభుత్వం చెప్పినట్లుగానే అన్ని నియమనిబంధనలకు అనుగుణంగానే షూట్ చేస్తున్నామని, పైగా కేవలం పదిహేను సభ్యులతో మాత్రమే షూట్ చేస్తున్నామని, అలాగే ఎక్కువ షెడ్యుల్స్ లేకుండా సింగిల్ షెడ్యూల్ లోనే షూట్ పూర్తి చేసేలా ప్లాన్ చేశామని.. అలాగే షూట్ లో తప్పకుండా సోషల్ డిస్టెన్స్ పాటిస్తామని మేకర్స్ పోస్టర్ ద్వారా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.
కాగా ఇప్పుడు చేస్తున్న షెడ్యూల్ కోసం ఒక విలేజ్ సెట్ వేశారట. ఈ సెట్ లోనే సినిమాని పూర్తి చేయనున్నారు. అలాగే ఈ సినిమాలోని కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు అన్ని ఈ సెట్ లోనే షూట్ చేస్తారట. అయితే ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి, అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఇలాంటి పెద్ద సినిమా షూటింగ్ చేయడం అంటే అది అంత సింపుల్ కాదు. మరి టీం ఎలా షూట్ చేస్తోందో చూడాలి. ఇక ఈ సినిమాకి మంచి డిమాండ్ ఉంది. కరోనా పుణ్యమా అని థియేటర్ లో సినిమా చూసే అవకాశం లేకపోవడం.. ఫ్యామిలీస్ లో శేఖర్ కమ్ముల సినిమాలకు మంచి గిరాకీ ఉండటంతో ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా బాగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పైగా క్రేజీ కాంబినేషన్ నాగచైతన్య – నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లు కావడం.. మొత్తానికి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో లవ్ స్టోరీకి ఫుల్ డిమాండ్ క్రియేట్ అయింది. అందుకే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా భారీ ఆఫర్ ను మేకర్స్ ముందు పెట్టిందని తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ గా వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ లవ్ స్టోరీతో నిర్మాణ రంగంలోకి దిగింది.