Homeఅంతర్జాతీయంభారత్‌ సైన్యాన్ని చూసి తోకముడిచిన చైనా..

భారత్‌ సైన్యాన్ని చూసి తోకముడిచిన చైనా..

china india war
‘చైనా ఒక అడుగు ముందుకేస్తే మేము పదడుగులు ముందుకేస్తాం.. అంతే తప్ప ఒక్క అడుగు జాగను కూడా వదులుకోం’ అంటూ ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. చైనా కూడా ఒక అడుగు ముందుకేసి.. రెండడుగులు వెనక్కి వేస్తున్నట్లు కపట బుద్ధి ప్రదర్శిస్తోంది. ఎప్పటికప్పుడు ఎల్‌ఏసీ వద్ద వివాదాలను చర్చలతో పరిష్కరించుకుందామంటూనే.. వాటిని సాగదీస్తూ.. మరిన్ని ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. చైనా ఆగడాలను పసిగడుతున్న భారత్‌ తనకు దీటైన జవాబు ఇస్తూనే ఉంది. తాజాగా చైనాకు తగిలిన మరో గాయం బయటపడింది.

ఆగస్టు 29 అర్ధరాత్రి పాంగాంగ్‌ ఉత్తర తీరంలోని ఫింగర్‌‌ 2 వరకూ ఆక్రమిద్దామని చైనా పన్నాగం పన్నింది. కరోనాతో పోరాడుతున్న భారత్‌ తమను ఎలా పసిగడుతుంది..? అటు వైపు ఆలోచన కూడా చేయదు.. అని అనుకుంది. ఎప్పుడూ క్రిమినల్‌ మైండ్‌ గేమ్‌ ఆడే డ్రాగన్‌ దేశాన్ని భారత్‌ కూడా సరైన రీతిలో ఉచ్చులో పడేసింది. చైనా చేరుకోవడానికి ముందే భారత్‌ అక్కడ యుద్ధ ట్యాంకులు, రాకెట్‌ లాంఛర్లను సిద్ధంగా పెట్టింది. వీటిని చూసిన చైనాకు దిమ్మదిరిగినట్లైంది. కీలక శిఖరాలపై మన సైతం ముందుగానే పాగా వేయడాన్ని జీర్ణించుకోలేకపోయింది. భారత సైతం రెండే రెండు గంటల్లో కీలకమైన బ్లాక్‌టాప్‌, హెల్మెట్‌, మగర్‌‌, గురుంగ్‌ శిఖరాలను తమ అధీనంలోకి తీసుకున్నారంటే.. మన దేశ సైన్యం సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు చైనా తన భూభాగమంటూ చెప్పుకుంటున్న రెజాంగ్‌ లా ప్రాంతంలోనూ ఇండియా ఫోర్స్‌ మోహరించింది.

ఆగస్టు 29, 31 తేదీల్లో చైనా ఏకపక్షంగా నియంత్రణ రేఖ హద్దులను మార్చాలని వ్యూహం పన్నింది. దీంతో అధికారులు స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌)ను రంగంలోకి దింపారు. వీలైనంత తొందరలో ఆపరేషన్‌ను ముగించాలనే ఉద్దేశంతో ఎస్‌ఎఫ్‌ఎఫ్‌ 120 నిమిషాల టార్గెట్‌ పెట్టుకుంది. ఆ రెండు గంటల్లోనే బ్లాక్‌టాప్‌, హెల్మెట్‌, మగర్‌, గురుంగ్‌ శిఖరాలను స్వాధీనం చేసుకుంది. అక్కడ చైనా ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ధ్వంసం చేసింది. ఆ వెంటనే 2 వేలకు పైగా భారత బలగాలు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంస క్షిపణులు, రాకెట్‌ లాంఛర్లతో ఆయా శిఖరాలపై పాగా వేశాయి. దీంతో డ్రాగన్‌ సైన్యం వ్యూహం దెబ్బతింది. మన సైన్యం గాల్లోకి కాల్పులు జరపడంతో తోక ముడిచింది. ఆ వెంటనే భారత సైన్యం రెజాంగ్‌-లా పాస్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇంత జరిగినా మళ్లీ రెండు రోజులకే మరో కుట్రకు తెరతీసింది.

Also Read : ట్రంప్‌ సంస్కరణలు ఇండో అమెరికన్ల ఓట్లు రాల్చేనా

ఆగస్టు 31న కూడా డ్రాగన్‌ రాగా.. మన యుద్ధ ట్యాంకుల శ్రేణిని చూసి, వెనక్కి తగ్గింది. ఎన్నడూ లేని విధంగా చైనా నోట రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, యోగా, దంగల్‌ సినిమా పేర్లు వినబడ్డాయి. చైనా రక్షణ మంత్రి స్వయంగా తాను భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో చర్చలకు సిద్ధం అని పదేపదే చెప్పే పరిస్థితులు వచ్చాయి. మొదటి సారి చైనా నోట ‘ఇతర దేశాలకు చెందిన ఒక అంగుళం భూమిని కూడా మేము ఆశించడం లేదు’ అని ప్రకటించాల్సి వచ్చింది. కాగా, చుషుల్‌లో ఇరు దేశాలకు చెందిన కమాండర్లు ఆదివారం జరిపిన చర్చలు.. ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి.

1962లో జరిగిన యుద్ధానికి ముందు నుంచీ ఎల్‌ఏసీ వద్ద భారత్‌ డిఫెన్స్‌ ధోరణిని అవలంబిస్తూనే ఉంది. కానీ.. చైనా మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే వందల చదరపు కిలోమీటర్లను ఆక్రమించింది. ఇన్నాళ్లు ఓపికతో ఉన్న భారత్‌ ఇప్పుడు సత్తాచాటాల్సి వస్తోంది. చైనా కుట్రలను తిప్పికొడుతోంది. 2017 డోక్లాం ఉదంతం నుంచి తన వైఖరి మార్చుకుంది. చైనాకు బుద్ధి చెప్పకుంటే తమ భూభాగాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని ఇప్పుడు దీటుగా నడుచుకుంటోంది. పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.

Also Read : చైనా భయపడిందా..చర్చలకు దిగొస్తోందా.. కారణమదే?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version