Prabhas
యంగ్ రెబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్ రెమ్యూనరేషన్ పై గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. కరోనా సమయంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు రూ.100కోట్లు తీసుకుంటున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఇందులో నిజమెంత? అని తెలుసుకునేందుకు ప్రతీఒక్కరూ ఆసక్తిని కనబరుస్తున్నారు.
Also Read : శివసేనను ఫుట్ బాల్ ఆడుతున్న కంగనా
దర్శకుడు రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి’ సిరీసులు ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబట్టాయి. టాలీవుడ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ ఆకాన్నంటింది. ఇందుకు తగ్గట్టుగానే ప్రభాస్ సైతం వరుసగా ప్యాన్ ఇండియా మూవీలకే కమిట్ అవుతున్నాడు.
‘బాహుబలి’ తర్వాత వచ్చిన ‘సాహో’ కూడా బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘సాహో’లో ప్రభాస్ యాక్షన్ కు బాలీవుడ్ ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. దీంతో ప్రభాస్ సినిమాలకు సౌత్ తోపాటు నార్త్ లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం ప్రభాస్ హోం బ్యానర్లో ఫ్రెండ్స్ తో కలిసి ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని చేస్తున్నాడు. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.
Also Read : కరోనాలో కూడా చైతు ‘లవ్ స్టోరీ’ మొదలైంది !
ఇక ‘రాధేశ్యామ్’ తర్వాత కూడా రెండు భారీ ప్రాజెక్టులకు ప్రభాస్ కమిట్ అయ్యాడు. ప్రతిష్టాత్మకమైన వైజయంతీ బ్యానర్లో ప్రభాస్ నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సైంటిఫిక్ మూవీలో ప్రభాస్ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ నటిస్తోంది. ఈ మూవీ కోసం ప్రభాస్ ఏకంగా 80కోట్ల రెమ్యూనేషన్ తీసుకుంటున్నాడనే టాక్ విన్పిస్తోంది.
దీంతోపాటు ఇటీవలే ‘ఆదిపురుష్’ మూవీ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ‘తానాజీ’ మూవీని తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ ‘ఆదిపురుష్’ మూవీని చేస్తున్నాడు.