సినిమాలకు సెన్సార్ ఎంత అవసరమో.. అంతకంటే ఎక్కువుగా వెబ్ కంటెంట్ కి సెన్సార్ అవసరం. ఇండియాలో వెబ్ కంటెంట్ కు కూడా సెన్సార్ సిస్టమ్ రాబోతుంది అంటూ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం నుండి మెసేజ్ వచ్చింది. ఆ వార్త విన్న ఫ్యామిలీ ఆడియన్స్ చాల సంతోషించారు. ఇకనైనా బూతుకు బ్రేక్ పడుతుందని. కట్ చేస్తే నెలలు గడిచాయి. వెబ్ కంటెంట్ అంతా బూతుమాయం అయిపోయింది.
కానీ సెన్సార్ కి సంబంధించి మాత్రం ఎలాంటి అప్ డేట్ లేదు. రోజురోజుకూ రెచ్చిపోయి మరీ బూతు సినిమాలను అలాగే బూతు సిరీస్ లను తీస్తున్నారు మేకర్స్. ఇన్నాళ్లు తెలుగులో కాస్త కంట్రోల్ లో వుంటోంది అనుకున్నాం. కానీ కొత్తగా ప్రముఖ సంస్థ యూవీ క్రియేషన్స్ కూడా బూతు సిరీస్ కి పచ్చ జెండా ఊపేసింది. ఇలాంటి టైమ్ లో కేవలం బూతు సిరీస్ లకు మాత్రమే డిమాండ్ ఉందని మేకర్స్ కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తున్నారు.
ఒక్కటి మాత్రం కచ్చితంగా అంగీకరించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ ఓటిటి లు, ఏటిటిలు వచ్చి మొత్తం బూతు వ్యవహారానికి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్నాయి. ఉదాహరణకు ఓటిటి కోసం హిందీలో కొన్ని బూతు సినిమాలను తీసి బాగా డబ్బు చేసుకున్నారు. వాటిని తెలుగులో కూడా డబ్ చేశారు. అయితే ఆ డబ్బింగ్ వెర్షన్ లో పరమ నీచమైన బూతులను యథేచ్ఛగా వాడేసి.. బూతు ప్రేక్షకుల మనసు దొచ్చుకున్నారు.
దాంతో ఆ సిరీస్ లు సూపర్ హిట్ అయిపోయాయి. అందుకే తెలుగు డైరక్టర్లు కూడా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుని, ఈ మధ్య వెబ్ సిరీస్ పేరిట బూతు సిరీస్ లు తీయడానికి తెగ కసరత్తులు చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ఇలాంటి వాటిని ఎలా చూడగలం. కర్మ కాలి ఓ ఓటిటీ ప్లాట్ ఫామ్ లోకి వెళ్లి చూసిన హోమ్ పేజీలోని బట్టలు లేకుండా రొమ్ములు నొక్కుకునే కనిపించే స్టిల్సే ఎక్కువుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఫ్యామిలీ ప్రేక్షకులు బాధతో సిగ్గుతో నవ్వులపాలు కాకుండా ఉండలాంటే.. కచ్చితంగా వెబ్ బూతుకి కూడా సెన్సార్ రావాలి.