
కరోనా మహమ్మారి సెకెండ్ వేవ్ లో యావత్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంది. దీని వల్ల వ్యవస్థలే విధ్వంసమవుతూ ఉన్నాయి. అయితే ఈ కరోనా సెకెండ్ వేవ్ టాలీవుడ్ లో పెళ్లి కానీ హీరోలకు మాత్రం పెళ్లి చేసుకోవడానికి మంచి అవకాశం దొరికినట్టు అయింది. ఎలాగూ పెళ్లి కాని హీరోలందరికీ 2020 ఎంతో కలిసొచ్చింది. తెలుగు చిత్రసీమలో మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్ గా కనిపించిన రానా దగ్గుబాటితో పాటు ఇతర యంగ్ హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, సాహో డైరెక్టర్ ఎట్టకేలకు ఓ ఇంటి వాళ్ళయ్యారు.
మొత్తానికి పై తదితరులతో పాటు క్రేజీ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా వివాహ బంధంలో అడుగు పెట్టి తన అభిమానులకు నిరాశను మిగిల్చింది. ఏది ఏమైనా గత సీజన్ లో కరోనా సమయాన్ని పై వారంతా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అన్నట్టు పై లిస్ట్ లో చెప్పుకోవాల్సిన మరో పేరు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా. కరోనాతో బ్రేక్ రావడంతో.. ప్రేమించిన వాడితో పెళ్లి పీఠలు ఎక్కి శ్రీమతిగా ప్రమోట్ అయిపోయింది.
ఇక ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ వచ్చి పడింది. మరి ఈ సారి ఎవరు పెళ్లి చేసుకోబోయేది అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో వినిపిస్తోన్న పేరు హీరో శర్వానంద్ ది. శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని తాజాగా ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి శర్వానంద్ ఓ ఇంటి వాడు కానున్నట్టు వస్తోన్న ఈ వార్తలో ఎంత నిజం ఉందో త్వరలోనే తేలనుంది.
అయితే ఇప్పటికే శర్వానంద్ ప్రేమలో ఉన్నాడని, తన చిన్ననాటి స్నేహితురాలు, ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో శర్వానంద్ ప్రేమలో ఉన్నాడని ఆ మధ్య బాగా వినిపించింది. పైగా శర్వానంద్ ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారట. ఇక త్వరలోనే పెళ్లికి కూడా ముహూర్తం ఖరారు చేయనున్నారని టాక్ నడుస్తోంది ప్రస్తుతం.