
HBD Ram charan : ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ఇండియా స్టార్ అయిన రాంచరణ్ ఆస్కార్ అవార్డుల వరకూ వెళ్లి సినిమా ప్రమోషన్లతో బిజిబిజీగా గడిపారు. దేశంలోకి వచ్చాక కూడా ఢిల్లీలో ఇండియా టుడే ఎన్ క్లేవ్ లో పాల్గొని అవార్డ్ అందుకున్నారు. ఇక హైదరాబాద్ వచ్చాక కూడా పలు కార్యక్రమాలతో బిజీ అయ్యారు.
అయితే ఆస్కార్ వచ్చిన ఉత్సాహంలో ఈసారి రాంచరణ్ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. ఈ బర్త్ డేకు టాలీవుడ్ కు సినీ ప్రముఖులు అందరూ హాజరయ్యారు.
వెంకటేశ్, నాగార్జునతోపాటు రానా, నిఖిల్, విజయ్ దేవరకొండ, ‘సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కాజల్, సుకుమార్, జగపతిబాబు, సహా చాలా మంది హీరోలు, దర్శకులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. వారందరినీ రాంచరణ్ ఆహ్వానించారు.
ఇక రాంచరణ్ కు ఈ క్రేజ్ తీసుకొచ్చిన దర్శకుడు రాజమౌళి చాలా సాదాసీదా దుస్తుల్లో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ కలర్ లెస్ షర్ట్.. కింద బ్లూ జీన్స్ వేసుకొని తన భార్య రమాతోపాటు కొడుకు కార్తికేయను , శ్రీవల్లితో సహా రాజమౌళి వచ్చాడు. ఇక కీరవాణికి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో ఉండడంతో రాలేకపోయాడు.
ప్రస్తుతం రాంచరణ్ బర్త్ డే కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కింద చూడొచ్చు.
